ఆ హీరో టీంలో ఒకరికి కరోనా పాజిటివ్… అందరూ క్వారంటైన్ లోనే  

Prithvirajs Aadujeevitham Crew Member Tests Positive - Telugu Corona Positive, Malayalam Cinema, Mollywood, Prithviraj\\'s \\'aadujeevitham\\' Crew Member Tests Positive, Telugu Cinema, Tollywood

కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయాయి.ఇక సినిమా షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి.

 Prithvirajs Aadujeevitham Crew Member Tests Positive

రెండు నెలలుగా షూటింగ్ లతో పాటు, సినిమా రిలీజ్ లు కూడా లేవు.ఈ నేపధ్యంలో మలయాళీ స్టార్ హీరో పృధ్వీ రాజ్ తన కొత్త సినిమా షూటింగ్ నిమిత్తం జోర్డాన్ వెళ్లి అక్కడ లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయారు.

రెండు నెలల పాటు అక్కడ ఉండి కొద్ది రోజుల క్రితం ఇండియా తిరిగి వచ్చారు.వచ్చిన వెంటనే అందరూ చిత్ర యూనిట్ మొత్తం హోం క్వారంటైన్ లోకి వెళ్ళిపోయి కరోనా టెస్ట్ లు చేయించుకున్నారు.

ఆ హీరో టీంలో ఒకరికి కరోనా పాజిటివ్… అందరూ క్వారంటైన్ లోనే-Movie-Telugu Tollywood Photo Image

అయితే టీంలో ఒక్కరికి మినహా అందరికి నెగిటివ్ వచ్చింది.యూనిట్ మొత్తానికి క్లీన్ చిట్‌ వస్తుందని భావించినా కూడా 58 ఏళ్ల వయసున్న ఓ యూనిట్ మెంబర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంలో చిత్ర బృందం షాక్‌ అయింది.

దాంతో అంతా ఒక్కసారిగా ఆందోళన పడుతున్నారు.ఈ నేపధ్యంలో కరోనా వచ్చిన వ్యక్తిని ఐసోలేషన్ సెంటర్ కి తరలించారు.కేరళలో కేసులో`కేసులు తగ్గుముఖం పట్టి మరల ఈ మధ్యనే బయటపడుతున్నాయి.ఇక పృధ్వీ రాజ్ టీంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో టీం మొత్తం హోం క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.

అలాగే అందరి మీద అబ్జర్వేషన్ పెట్టినట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prithvirajs Aadujeevitham Crew Member Tests Positive Related Telugu News,Photos/Pics,Images..

footer-test