సలార్ తో ప్రతి నాయకుడుగా కనిపించబోతున్న పృథ్వీరాజ్

మలయాళీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న పృథ్వీరాజ్ మోహన్ లాల్ తో లూసీఫర్ అనే సినిమాని దర్శకుడుగా తెరకెక్కించి హిట్ కొట్టాడు.

 Prithviraj Sukumaran Villain Role In Salaar Movie-TeluguStop.com

ఇక పృథ్వీరాజ్ కెరియర్ ఆరంభంలో తెలుగులో ఓ సినిమా చేశాడు.అయితే అవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

మలయాళంలో సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ టాలీవుడ్ వైపు అతను చూడలేదు.అయితే పృథ్వీరాజ్ తెరకెక్కించిన లూసీఫర్ మూవీని మెగాస్టార్ చిరంజీవి ఏకంగా రీమేక్ చేయడం విశేషం.

 Prithviraj Sukumaran Villain Role In Salaar Movie-సలార్ లో ప్రతి నాయకుడుగా పృథ్వీరాజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మలయాళం ఇండస్ట్రీలో రచయితగా, సింగర్ గా, దర్శకుడుగా, స్టార్ హీరోగా పృథ్వీరాజ్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు.
డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ ఈ మధ్యకాలంలో వరుస హిట్స్ ని ఖాతాలో వేసుకున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు పృథ్వీరాజ్ పాన్ ఇండియా మూవీలో భాగం అవుతున్నాడు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీలో పృథ్వీరాజ్ ప్రతినాయకుడుగా నటిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించకున్న ఇప్పటికే ప్రశాంత్ నీల్ పృథ్వీరాజ్ ని కలిసి కథ కూడా నేరేట్ చేయడం జరిగిందని సమాచారం.అతను కూడా నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉందని బోగట్టా.ఇదిలా ఉంటే ఈ మూవీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈమెకి కూడా సలార్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని టాక్.దీనికోసం శృతి హాసన్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకుంటుంది.

#Darling Prabhas #KGFChapter #Prashanth Neel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు