వాళ్ళు పక్కా ప్లాన్ తోనే వెన్నుపోటు పొడిచారు అంటున్న పృథ్వి...

మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పార్టీ అధికారంలోకి రాగానే పార్టీకి ఎన్నికల ప్రచార సమయంలో సేవలందించినందుకు గాను సీనియర్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ చైర్మన్ పదవి బాధ్యతలు కట్టబెట్టిన సంగతి తెలిసిందే.అయితే  ఈ మధ్య కాలంలో పృథ్వి ఎస్వీబీసీ ఛానల్ లో పనిచేసే ఎటువంటి ఓ మహిళతో మాట్లాడిన టువంటి ఆడియో టేప్ బయటికి రావడంతో చైర్మన్ పృథ్విని బాధ్యత గల చైర్మన్ పదవి నుంచి తొలగించారు.

 Prithvi Said They Are Involving Me-TeluguStop.com

అయితే తే పృథ్వి అప్పట్లో ఈ విషయం గురించి మీడియా ముందు నోరు విప్పలేదు కానీ తాజాగా ఈ విషయం గురించి స్పందించాడు.

తాను ఏ తప్పు చేయలేదని అక్కడ పని చేస్తున్నటువంటి కొందరు తనపై కక్ష పెంచుకుని తాను మాట్లాడుతున్నట్లు మిమిక్రీ చేసి తనను కావాలనే ఇరికించారని వాపోయాడు.

అలాగే తాను చైర్మన్ పదవిలో కొనసాగుతున్నప్పుడు ఎస్వీబీసీ ఛానల్ లో ఉద్యోగ ప్రక్షాళన చేపట్టానని ఆ సమయంలో కొందరికి ఉద్వాసన తగిలిందని అందువల్లే ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని వెన్నుపోటు పొడిచారని అన్నారు.అయితే ఈ విషయం జరిగిన తర్వాత కొందరు అధికార పక్ష నాయకులు పృథ్వి పార్టీ మారుతున్నాడని పలురకాల పుకార్లు పుట్టిస్తున్నారని అన్నారు.

ఈ విషయంపై కూడా పృథ్వి స్పందిస్తూ తాను పార్టీ మారుతున్నానని వస్తున్నటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదని తనకంటే ఇంతవరకు వైకాపా పార్టీలోనే కొనసాగుతానని స్పష్టత ఇచ్చారు.అంతేకాక ఈ విషయం గురించి ప్రస్తుతం విచారణ జరుగుతోందని అందులో తన నిర్దోషినని ఖచ్చితంగా నిరూపించుకొని మళ్లీ తిరిగి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవిని చేపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube