జగన్ ఓట్లు అడిగితే ప్రజలు తరిమి కొడతారు.. పృథ్వీ రాజ్ షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఖడ్గం సినిమాలోని ఈ డైలాగుతో ఈయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.

 Prithvi Raj Shocking Comments On The Cm Jagan , Prithvi Raj, Tollywood, Cm Jagan , Prithvi Raj Shocking Comments , Bhakti Channel ,tollywood , Ycp Party , Chairman Of Sri Venkateswara Swamy-TeluguStop.com

ఇలా సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఈయన రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో సైతం తన మార్క్ చూపించారు.గత ఎన్నికలలో భాగంగా వైసీపీ పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించిన ఈయన కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి ఈయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ చైర్మన్ గా నియమించారు.

అయితే ఆ పదవి ఎక్కువకాలం ఉండలేదని చెప్పాలి.

 Prithvi Raj Shocking Comments On The Cm Jagan , Prithvi Raj, Tollywood, Cm Jagan , Prithvi Raj Shocking Comments , Bhakti Channel ,tollywood , YCP Party , Chairman Of Sri Venkateswara Swamy-జగన్ ఓట్లు అడిగితే ప్రజలు తరిమి కొడతారు.. పృథ్వీ రాజ్ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పృథ్వీరాజ్ పై లైంగిక ఆరోపణలు రావడం చేత అయ్యానని ఆ పదవి నుంచి తప్పించారు.

అయితే ఈ పార్టీలో ఉన్న సమయంలో ఈయన టాలీవుడ్ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అనంతరం పశ్చాత్తాప పడ్డాడు.ప్రస్తుతం ఈయన వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి పెద్ద ఎత్తున పార్టీ గురించి ఆరోపణలు చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన వైసీపీ పార్టీ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలందరూ కలిసి మద్యానికి బానిసలు అయ్యారని ఉన్న డబ్బు మొత్తం కల్తీ మందు కోసం ఖర్చు పెడుతున్నారని ఆరోపణలు చేశారు.భూముల కోసం అమరావతిలో పోరాటం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అభివర్ణించారు.అందుకు ఆయన వారికి క్షమాపణలు చెప్పాలి.

ఇక నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు అమరావతి రైతుల గురించి తప్పుగా మాట్లాడాను అందుకు వారు నన్ను క్షమించాలని కోరారు.అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడినందుకు వారు నన్ను క్షమించారు అందుకు వారికి కృతజ్ఞతలని తెలిపారు.

ఇలా జగన్ పరిపాలన వల్ల ప్రజలు ఎంతో విసుగు చెందారు.ఈసారి జగన్ వచ్చి ఓటు అడిగితే ప్రజలు తరిమి కొడతారు అంటూ జగన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube