ఫస్ట్ లేడీ హోదా ముందు..డాక్టరేట్ గుర్తింపు ఉండకూడదా..??

అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేసి అధ్యక్ష భవనంలోకి అడుగు పెట్టడానికి సిద్దంగా ఆన్నారు. జనవరి 20వ తేదీన బిడెన్ సతీ సమేతంగా వైట్ హౌస్ లోకి వెళ్లనున్నారు.

 Prior To First Lady Status, There Should Be No Doctorate Recognition, Us Presid-TeluguStop.com

ఈ క్రమంలోనే అమెరికాలో ఓ వింతైన చర్చ జరుగుతోంది.కాబోయే ఫస్ట్ లేడీ జిల్ బిడెన్ తన ఫస్ట్ లేడీ పేరు ముందు డాక్టరేట్ ఉంచుకోవాలా, ఉంచకూడదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు ఈ విషయం రచ్చ రచ్చ అవుతోంది.సదరు ప్రొఫెసర్ ఇచ్చిన సూచనలపై అమెరికాలోని మహిళా లోకం భగ్గుమంది.

వివరాలలోకి వెళ్తే.

Telugu Lady Jill Biden, Lady Status, Hillary Clinton, Michelle Obama, Lady Hada,

వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక

లో ప్రచురించిన ఓ వ్యాసంలో ఓ యూనివర్సిటీకి చెందిన జోసెఫ్ అనే ప్రొఫెసర్ త్వరలో ఫస్ట్ లేడీ గా వైట్ హౌస్ లోకి అడుగు పెట్టనున్న జిల్ ఆమె ఫస్ట్ లేడీ హోదా ముందు డాక్టరేట్ ను వాడకూడదని, అలా చేస్తే అది వైట్ హౌస్ గౌరవానికే భంగం కలిగే విషయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.దాంతో మహిళలపై పురుషులు చూపిస్తున్న ఆధిపత్యానికి ఇదో నిదర్శనం అంటూ మహిళా సంఘాలు జిల్ బిడెన్ కు మద్దతు పలికాయి.ఈ ఘటనపై మాజీ అధ్యక్షుల భార్యలు, మిషెల్ ఒబామా, హిల్లరీ క్లింటన్ ఘాటుగానే స్పందించారు.

ప్రధమ మహిళ అయ్యి అధ్యక్ష భవనంలో ఉంటే ఆమెకు గుర్తింపు తీసుకువచ్చి, కష్టపడి సంపాదించుకున్న డాక్టరేట్ గౌరవాన్ని పక్కన పెట్టాలా అంటూ మండిపడ్డారు.13ఏళ్ళ క్రితమే ఎంతో కష్టపడి డాక్టరేట్ చేసి ఈ గౌరవాన్ని సాధించుకున్నారు, చదువు అన్నా, విద్యార్ధులకు భోధన అన్నా జిల్ బిడెన్ కు పంచ ప్రాణాలని మిషెల్ తెలిపారు.వైట్ హౌస్ లో ఆమెతో ఎనిమిదేళ్ళుగా ఉన్నాను ఆమెకు విద్య అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు ఎంతో నిబద్దతతో ఉన్న వ్యక్తి ఆమె.సెకండ్ లేడీ హాదా ఉన్నప్పుడు కూడా ఆమె తన వృత్తిని కొనసాగించారు, గౌరవించారని, ప్రధమ మహిళ అయినా సరే ఉపాధ్యాయ వృత్తే తనకు ఎంతో ముఖ్యమని నేను నా వృత్తిని కొనసాగిస్తానని ఆమె ప్రచార సమయంలోనే తెలిపారని మిషెల్ గుర్తు చేశారు.ఆమె ఏ హోదాలో ఉన్నా సరే తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న డాక్టరేట్ గౌరవం కొనసాగుతుందని మిషెల్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube