ఇకనుంచి 500 నోట్ల కొరత ఉండదు. ఎందుకంటే!   Printing Of New 500 Notes Fastened By The Government     2016-12-24   04:53:13  IST  Raghu V

కరెన్సి బ్యాన్ విధించి నెలలు గడుస్తున్న ఇంకా సామన్య ప్రజలకి కష్టాలు తప్పట్లేదు. ATM దగ్గర భారీ లైన్లు. గంటలకొద్దీ నిలబడితే దొరికేది రెండు వేల రూపాయల నోటు. మళ్ళీ దాన్ని విడిపించడానికి తంటాలు పడాలి. కొత్త ₹500 నోటు అందుబాటులోకైతే వచ్చింది కాని, అది ఎక్కడో ఓ చోట దొరకడమే. అయితే ఇకనుంచి ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. ₹500 నోటు ఇకనుంచి ఈజిగా దొరుకుతుంది.

నాసిక్ లోని నోట్ల ముద్రాణాలయంలో ₹500 నోట్ల ముద్రణ వేగవంతం చేశారు. ఇప్పటిదాకా రోజుకి 35 లక్షల కొత్త ₹500 నోట్లు ముద్రించుకుంటూ వచ్చిన అధికారులు, ఇప్పుడు రోజుకి కోటి కొత్త నోట్లు ముద్రిస్తున్నారట.

ఈమధ్యే 4.30 కోట్ల కొత్త నోట్లు ఆర్బీఐకి పంపించారట . అందులో కోటి అరవై లక్షల నోట్లు ₹500 వాల్యూవి కాగా, 1.20 కోట్ల వంద నోట్లు, మీగితావి 50,20 నోట్లు అంట.

అంటే, రోజుకు కోటి ₹500 కొత్త నోట్లు వస్తున్నాయి కాబట్టి, మరికొద్ది రోజుల్లో 500 నోట్ల కొరత చాలావరకు తగ్గిపోతుందన్నమాట.