నోటు పై అచ్చు తప్పు.... కనిపెట్టేందుకు ఆరు నెలలు పట్టిందట!

పుస్తకాలలో అచ్చు తప్పులు ఉండడం సహజం.కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న అక్షర దోషాలు ఉన్నా వాటి అర్ధాలు కూడా మారిపోతుంటాయి.

 Printing Mistake On The Dollar-TeluguStop.com

అయితే పుస్తకాల్లో అచ్చు తప్పులు దొర్లితే గురువు సరిచేసి చెబుతారు కానీ నోట్ల మీద అచ్చు తప్పు దొర్లితే ఎవరు ఏమి చేయగలరు.సరిగ్గా ఆస్ట్రేలియా లో ఇదే జరిగింది.’50 ఆస్ట్రేలియన్ డాలర్ల’ నోట్ల పై “responsibility” బదులుగా “responsibilty” అంటూ తప్పుగా అచ్చు అయ్యాయి.ఒకటి కాదు రెండు కాదు దాదాపు 4.6 కోట్ల కరెన్సీ నోట్లను ముద్రించేసారు.అయితే ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ తప్పు దొర్లింది అని అక్కడి రిజర్వ్ బ్యాంకు గుర్తించడానికి ఆరు నెలలు పట్టింది.

అసలు ఆస్ట్రేలియా లో అత్యధికంగా చెలామణి అయ్యే నోటు ఈ నోట్ కావడం విశేషం.అలాంటి నోటు పై అచ్చు తప్పు దొర్లినా రిజర్వ్ బ్యాంకు పట్టించుకోలేదు.

ఈ నోటు లో మరో ప్రత్యేకత ఏమిటంటే ఆ దేశ పార్లమెంటు తొలి మహిళా సభ్యురాలు ఎడిత్ కోవన్ చిత్రంతో ముద్రించడమే కాకుండా పార్లమెంట్ లో ఆమె చేసిన తోలి ప్రసంగం లోని కొంత భాగాన్ని కూడా ముద్రించారు.

అయితే ప్రసంగంలో రెస్పాన్సిబిలిటీ అన్న పదం వచ్చిన పలు సార్లు అదే అచ్చు తప్పు దొర్లింది.

అయితే భూతద్దంతో చూస్తే గానీ ఈ తప్పు కనిపించదట.అందుకే వారికి ఈ విషయం తెలియడానికి ఆరు నెలలు పట్టింది.

ఈ నోట్లను గతేడాది చివర్లో విడుదల చేశారు అది కాకుండా దొంగ నోట్లను అరికట్టేందుకు అధునాతన భద్రత ప్రమాణాలతో వీటిని రూపొందించారు.అయితే ఆ నోటు లో అచ్చు తప్పు దొర్లిన మాట వాస్తవమే అని ఆస్ట్రేలియా రిజర్వు బ్యాంకు ధృవీకరించి, అయితే భవిష్యత్తులో ఇలాంటి తప్పు దొర్లకుండా తప్పను సరిచేస్తామని వివరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube