ఒక పదిహేనేళ్ల బాలిక పై యాసిడ్ దాడి ఘటన చోటుచేసుకుంది.అయితే దాడికి పాల్పడింది ఎవరు అని తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు.
విద్యార్థులను సరైన దారిలో పెట్టాల్సిన గురువులే ఇలా యాసిడ్ దాడికి పాల్పడడం గమనార్హం.స్కూల్ ప్రిన్సిపాల్,ఉపధ్యాయుడు, సిబ్బంది కలిసి బాలిక పై యాసిడ్ దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటన ముంబై మార్గ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.బాధితురాలు మార్నింగ్ వాక్ కు అని బయటకు వచ్చిన సమయంలో కాపు కాసి మరి ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు.
బాధిత బాలిక గతంలో నషేమన్ ఉర్ధూ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదవగా ప్రస్తుతం మహీంలోని ఓ ఇనిస్టిట్యూట్ నుంచి ఎలక్ర్టానిక్ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేస్తోంది.అయితే ఎందుకు ఆమె పై ఇలా యాసిడ్ దాడికి పాల్పడ్డారు అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.
అయితే గతంలో కూడా స్కూల్ లో చదువుతున్న సమయంలో అకారణంగా స్కూల్ సిబ్బంది, టీచర్లు శిక్షించే వారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొనింది.అయితే మార్నింగ్ వాక్ కు వచ్చిన తనను అడ్డగించిన స్కూల్ సిబ్బంది జావేద్,హషీమ్,అమన్ లు తన చేతులు పట్టుకోగా, ప్రిన్సిపాల్ హన్స్ ఆరా యాసిడ్ దాడి చేసినట్లు బాధితురాలు తెలిపారు.
తనపై యాసిడ్ పోసిన తరువాత తనను అక్కడే వదిలేసి వారంతా కారులో పారిపోయినట్లు తెలిపింది.
అయితే ఆ సమయంలో ఫోన్ చేసి తండ్రికి విషయం చెప్పడం తో అక్కడకి చేరుకున్న తండ్రి ఆమెను రాజ్ వాది ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.విద్యార్థులకు మంచి చెడు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఇలా ఒక విద్యార్థి పై యాసిడ్ దాడికి పాల్పడడం దారుణమైన విషయం.
ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.