ప్రిన్సెస్ డయానా జాకెట్ ఖరీదు ఇంతకి అమ్ముడుపోయింది అంటే  

Princess Diana\'s Old Gym Sweatshirt Sold For Rs 37 Lakh At Auction-

సెలబ్రిటీలు, ప్రముఖులు వాడే వస్తువులు అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.అలాగే కొన్ని ప్రముఖైన చారిత్రాత్మక సంఘటనలకి సంబంధించి గుర్తులని కూడా తమ దగ్గర ఉంచుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.అలాంటివి వేలంకి వచ్చినపుడు ఎంత ధర అయిన కొనడానికి పోటీ పడతారు..

Princess Diana\'s Old Gym Sweatshirt Sold For Rs 37 Lakh At Auction--Princess Diana's Old Gym Sweatshirt Sold For Rs 37 Lakh At Auction-

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోటీశ్వరులలో ఇలా హిస్టోరికల్ జ్ఞాపకాలు ఎక్కువగా సేకరించే అలవాటు ఉంటుంది.ఇక సినిమా, క్రికెట్, రాజకీయ ప్రముఖులు ఉపయోగించే వస్తువులకి వేలంలో భారీగా డిమాండ్ ఉంటుంది.తాజాగా ప్రిన్సెస్ డయానా వాడిన ఓ జాకెట్ కి కూడా భారీ ధరకి అమ్ముడుపోయింది.

బ్రిటన్ రాణి ఎలిజబెత్ కోడలు, దివంగత ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానా ధరించిన ఓ డ్రెస్ ఊహించని స్థాయిలో భారీ ధరకు అమ్ముడుపోయింది.డయానా జిమ్ చేసే సమయంలో ఆమె ధరించిన స్వెట్‌షర్టును తన జిమ్ ట్రైనర్ జెన్నీ రివెట్‌కు బహుమతిగా ఇచ్చింది.ఆ షర్టును జెన్నీ ఈ మధ్య వేలం వేసింది.

ఆ వేలంలో ఆ జాకెట్ ఏకంగా 37 లక్షలకి అమ్ముడు పోయింది.ప్రిన్సెస్ డయానా అంటే అప్పట్లో ఓ గ్లామర్ క్వీన్.ఆమె బ్రిటన్ రాణి ఎలిజబెత్ కోడలు అయిన తర్వాత విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది.అనంతర కాలంలో తన భర్తతో విడాకులు గొడవల కారణంగా విడాకులు తీసుకుంది.

కొంత కాలానికి కారు ప్రమాదంలో మృతి చెందింది.ఆమె వారసులుగా ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ.