మహేష్ బాబు వదులుకున్న 7 సూపర్ హిట్ సినిమాలు

ప్రిన్స్ మ‌హేష్ బాబు.టాలీవుడ్ సూప‌ర్ స్టార్.

 Prince Mahesh Babu Rejected Movies List , Mahesh Babu, Rejected Movies, Block Bu-TeluguStop.com

ఈయ‌న న‌టించి సినిమాల్లో ఒక‌టి అర త‌ప్ప అన్నీ సూప‌ర్ హిట్స్.మ‌రికొన్ని సినిమాలు ఆయ‌న ముందుకు వ‌చ్చినా.

కొన్ని కార‌ణాల వ‌ల్ల వాటిని వ‌ద్ద‌నుకున్నాడు.విచిత్రం ఏంటంటే ఆయ‌న వ‌దులుకున్న సినిమాల‌న్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన‌వే.

తాజాగా ఓ సినిమా నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు మ‌హేష్ బాబు చెప్పాడు.ఈ నిర్ణ‌యం ఆయ‌న ఫ్యాన్స్ ను ఎంతో డిస్స‌ప్పాయింట్ చేసింది.

క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో సినిమా చేస్తున్న‌ట్లు ఏడాది కింద‌టే మ‌హేష్ ప్ర‌క‌టించాడు.డైరెక్ట‌ర్ తో వ‌చ్చిన క్రియేటివ్ పొర‌పొచ్చాల వ‌ల్ల సినిమా నుంచి త‌ప్పుకున్నాడు.

ఈ సినిమా ఇప్పుడు మెగా హీరో అల్లూ అర్జున్ చేస్తున్నాడు.ఇదే కాదు ఎన్నో మంచి సినిమాల‌ను ఆయా కార‌ణాల‌తో మ‌హేష్ వ‌ద్ద‌నుకున్నాడు.

సూప‌ర్ స్టార్ రిజెక్ట్ చేసిన ఆ బంఫ‌ర్ హిట్ చిత్రాలేంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం!

1.మ‌న‌సంతా నువ్వే

Telugu Aa, Allu Arjun, Emmaya Chesave, Fida, Kathi, Mahesh Babu, Manasanta Nuvve

ఈ సినిమా అప్ప‌ట్లో ఓ రేంజిలో సూప‌ర్ హిట్ అయ్యింది.ఉద‌య్ కిర‌ణ్ హీరోగా నటించిన ఈ మూవీ యూత్‌ను తెగ అట్రాక్ట్ చేసింది.టాలీవుడ్ వెండి తెరను ఊపు ఊపింది.

అయితే ఈ సినిమాలో తొలుత హీరోగా మ‌హేష్ బాబునే సూచించాడ‌ట నిర్మాత ఎంఎస్ రాజు.అప్ప‌టికే రాజ‌కుమారుడు, యువ‌రాజు సినిమాలు చేసి మంచి హిట్‌లు సాధించాడు.

అదే స‌మ‌యంలో ఉద‌య్ కిర‌ణ్ హీరోగా న‌టించిన చిత్రం సినిమా రిలీజై మంచి విజ‌యం సాధించింది.వెంట‌నే మ‌హేష్ బాబు ప్లేస్‌లో ఉద‌య్ కిర‌ణ్‌ను రీప్లేస్ చేశారు.మ‌న‌సంతా నువ్వే సూప‌ర్ హిట్ అయ్యింది.

2.ఏమాయ చేశావె

Telugu Aa, Allu Arjun, Emmaya Chesave, Fida, Kathi, Mahesh Babu, Manasanta Nuvve

అక్కినేని కుటుంబ హీరో నాగ చైత‌న్య హీరోగా నటించిన తొలి సినిమా ఏమాయ చేశావె.ఆయ‌న కెరీర్‌లోనూ బిగ్గెస్ట్ హిట్.ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ తొలుత హీరోగా మ‌హేష్ ను అనుకున్నాడ‌ట‌.అనివార్య కార‌ణాల వ‌ల్ల ఇందులో ప్రిన్స్ న‌టించ‌లేక‌పోయాడ‌ట‌.ఆ సినిమా కాస్త నాగ చైత‌న్య చేతికి చిక్కి బంఫ‌ర్ హిట్‌గా నిలిచింది.

3.రుద్ర‌మ దేవి

Telugu Aa, Allu Arjun, Emmaya Chesave, Fida, Kathi, Mahesh Babu, Manasanta Nuvve

రుద్ర‌మ దేవి చిత్రంలోనూ మ‌హేష్ న‌టించాల్సి ఉన్నా.కొన్ని కార‌ణ‌ల వ‌ల్ల అది సాధ్యం కాలేదు.ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్ట‌ర్ గోన గ‌న్నారెడ్డి.మ‌హేష్ బాబు చేయాల‌నుకున్న చేయ‌లేక‌పోయాడ‌ట‌.ఈ క్రేజీ అవ‌కాశం అల్లు అర్జున్ పొంది.సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు.

4.24

Telugu Aa, Allu Arjun, Emmaya Chesave, Fida, Kathi, Mahesh Babu, Manasanta Nuvve

విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సైన్స్ ఫిక్ష‌న్ మూవీ 24.ఈ సినిమాలో సూర్య మూడు క్యారెక్ట‌ర్లు చేసి వారెవ్వా అనిపించాడు.ఈ సినిమాలో మొద‌ట మ‌హేష్ ను నటించాల‌ని అడిగార‌ట‌.

బ్ర‌హ్మోత్స‌వం, శ్రీ‌మంతుడు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న మ‌హేష్.ఈ అవ‌కాశాన్ని చేజార్చుకున్నాడు.

5.క‌త్తి

Telugu Aa, Allu Arjun, Emmaya Chesave, Fida, Kathi, Mahesh Babu, Manasanta Nuvve

త‌మిళ సూప‌ర్ డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్, విజ‌య్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది.ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్నారు.ఇందుకోసం మ‌హేష్ బాబును కాంటాక్ట్ అయ్యారు.

అయితే రీమేక్ సినిమాల్లో నటించేందుకు ఇష్టం లేద‌న్నాడ‌ట‌.దీంతో చిరంజీవి హీరోగా ఖైదీనెంబ‌ర్ 150ని తెర‌కెక్కించారు.

6.అఆ

Telugu Aa, Allu Arjun, Emmaya Chesave, Fida, Kathi, Mahesh Babu, Manasanta Nuvve

త్రివిక్ర‌మ్ క్రేజీ ప్రాజెక్ట్ అఆ.ఈ రొమాంటిక్, కామెడీ మూవీని తొలుత మ‌హేష్ బాబుకోసం ప్రిపేర్ చేశాడ‌ట‌.కానీ మ‌హేష్ ఈ సినిమాకు నో చెప్పాడ‌ట‌.

దీంతో ఆ అవ‌కాశం కొట్టేశాడు నితిన్.త‌న కెరీర్‌లో మంచి విజ‌యం సాధించాడు.

7.ఫిదా

Telugu Aa, Allu Arjun, Emmaya Chesave, Fida, Kathi, Mahesh Babu, Manasanta Nuvve

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా మంచి స‌క్సెస్ సాధించింది.ఈ మూవీలోన‌టించాల‌ని మ‌హేష్ ను కోరాడ‌ట శేఖ‌ర్ క‌మ్ముల.అయితే త‌న‌కు ఈ క్యారెక్ట‌ర్ స‌రిప‌డ‌ద‌ని చెప్పాడ‌ట ప్రిన్స్.

దీంతో ఈ సినిమా హీరోగా వ‌రుణ్ తేజ్‌ను ఎంపిక చేసి బిగ్గెస్ట్ హిట్ సాధించాడు శేఖ‌ర్ క‌మ్ముల‌.

మొత్తంగా మ‌హేష్ వ‌దులుకున్న ప‌లు సిన‌మాలు బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube