ముద్దు పెట్టేసిన ప్రిన్స్.... ఇంతకంటే ఇంకేం అడగను అంటున్న డైరెక్టర్  

Prince Kisses The Director-kisses,maharshi,mahesh Babu,movie Updates,prince

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించి రిలీజ్ అయిన చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం సూపర్ హిట్ అయినట్లు టాలీవుడ్ టాక్. అయితే ప్రిన్స్ మహేష్ బాబు తనకు ఇంతటి హిట్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి కి ముద్దు కూడా పెట్టాడట. ఇప్పటికే ఈ చిత్రం గురించి,వంశీ గురించి పలు సార్లు మాట్లాడిన మహేష్ ఇప్పుడు ఈ ఆనందం తట్టుకోలేక ఏకంగా వంశీ కి ముద్దు పెట్టేశాడు..

ముద్దు పెట్టేసిన ప్రిన్స్.... ఇంతకంటే ఇంకేం అడగను అంటున్న డైరెక్టర్ -Prince Kisses The Director

ఇప్పుడు దీనికి సంబందించిన ఫోటో సామజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారాయి. మహేష్ తనకు ముద్దు పెడుతుండగా వంశీ సెల్ఫీ తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ “ఇదే నా జీవితంలో బెస్ట్ మూమెంట్. ఇంతకంటే ఇంకేం అడగగలను’. అని క్యాప్షన్ పెట్టాడు.

ఇక ఈ సినిమా లో వంశీ చూపించిన వీకెండ్ వ్యవసాయం అనే కాన్సెప్ట్ ఈ తరం యూత్ బాగా ఫాలో అవుతుంది.

ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వారాంతంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై వాటికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూన్నారు. మహేష్ 25 వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మే 9 న ఈ సినిమా రిలీజ్ అవ్వగా ప్రేక్షకుల భారీ అంచనాలను మాత్రం అందుకోవడం లో విఫలం అయ్యింది అని చెప్పాలి. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఈ చిత్ర విజయం పొందింది అంటూ సంబరాలు చేసుకుంటుంది.