జనవరి 6 ఘటన .. ట్విట్టర్ సీఈవోను ముందురోజే హెచ్చరించా : ప్రిన్స్ హ్యారీ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం ఈ ఏడాది జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.

 Prince Harry Says He Warned Twitter Ceo Of Us Capitol Riot , Joe Biden,  Us Cong-TeluguStop.com

ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.

బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.

దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ ఘటనకు సంబంధించి ఎన్నో విచారణ కమీటీలు దర్యాప్తు చేస్తున్నాయి.

ప్రస్తుతం ఈ వ్యవహారం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది.దీనిపై హౌస్ కమిటీ విచారణ నుంచి తప్పించుకునేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ వ్యవహారంలోనే మొన్న ట్రంప్‌కు ఫెడరల్ కోర్ట్ న్యాయమూర్తి షాకిచ్చారు.యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్‌ వద్ద హింసకు సంబంధించిన వైట్‌హౌస్ రికార్డులను కాంగ్రెస్ ఇన్వెస్టిగేటర్లకు అప్పగించొద్దంటూ ట్రంప్ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది.

ఆ వెంటనే ట్రంప్ హయాంలో ఉన్నత పదవుల్లో వున్నవారు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం చేసినట్లు దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే.ఈ వరస ఘటనలు ట్రంప్‌ను చిక్కుల్లో పడేస్తుండగా.

అమెరికన్ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.

సరిగ్గా ఇదే సమయంలో బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ జనవరి 6 ఘటనకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాలిఫోర్నియాలో ‘రి:వైర్డ్‌’ పేరిట జరిగిన ఓ ఆన్‌లైన్‌ టెక్‌ సదస్సుకు ప్రిన్స్‌ హ్యారీ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

ట్విట్టర్‌ను వాడుకుని క్యాపిటల్ హిల్‌పై దాడికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాను స్వయంగా ఆ సంస్థ సీఈవోకు మెయిల్ ద్వారా ఒకరోజు ముందే సమాచారం ఇచ్చానని ప్రిన్స్ హ్యారీ వ్యాఖ్యానించారు.కానీ, తన మెయిల్‌కు ఆయన నుంచి ఎలాంటి రిప్లయ్ రాలేదని వెల్లడించారు.

Telugu Federal, Joe Biden, Prince Harry, Princeharry, Wired, Trump, Congress, Wh

మరోవైపు ప్రిన్స్ హ్యారీ వ్యాఖ్యలపై ట్విటర్‌ స్పందించలేదు.క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఖాతాలపై ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా సంస్థలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.దీంతో తన మనసులోని ఆలోచనలు, తన కార్యక్రమాలను ప్రజలతో ఎలా పంచుకోవాలో తెలియక ట్రంప్‌ ఇబ్బందులు పడ్డారు.ఈ క్రమంలోనే ఇటీవల ‘ట్రూత్’ పేరుతో సొంతంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube