మొదటిసారి తండ్రి అయినందుకు ఆనందంగా ఉంది అంటున్న ప్రిన్స్

గతేడాది బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, నటి మేఘన్ మార్కెల్ వివాహ బంధం తో ఒక్కటైన సంగతి తెలిసిందే.అయితే ఈ జంట సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తుంది.

 Prince Harry Became Father-TeluguStop.com

ఈ విషయాన్ని ప్రిన్స్ హ్యారీ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపారు.మొదటిసారి తండ్రి ని అయినందుకు ఆనందంగా, ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంది అంటూ హ్యారీ ఆనందం వ్యక్తం చేశారు.3.2 కేజీల బరువుతో పండంటి మగ బిడ్డ జన్మించాడని,తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమమే అని అధికారిక నివాసం అయిన బకింగ్ హమ్ ప్యాలెస్ కూడా ప్రకటన ద్వారా తెలిపింది.

అయితే విశేషం ఏమిటంటే వీరిద్దరికీ జన్మించిన ఈ బిడ్డకు రెండు దేశాల పౌరసత్వాలు లభించనున్నాయి.ఈ బుల్లి యువ రాజుకు బ్రిటన్ పౌరసత్వం తో పాటు తల్లి మేఘన్ నుంచి అమెరికా పౌరసత్వం కూడా లభించనుంది.

పండంటి మగ జన్మనించిన ఈ జంటకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే కూడా ఈ సందర్భంగా వారిద్దరికీ కంగ్రాట్స్ తెలుపుతూ ట్వీట్ చేశారు.

గతేడాది హ్యారీ,మేఘన్ ల వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.వీరి వివాహానికి పలువురు ప్రముఖులు హాజరై వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube