వెర్రితనం: టైం బాగాలేదని ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని?

సమాజంలో అనేక రకాల మనుషులు వుంటారు.కష్టపడి కేవలం కష్టాన్నే నమ్ముకొన్న వ్యక్తులు కొందరైతే, కేవలం అదృష్టాన్నే నమ్ముకున్నవారు రెండవరకం.

 Prime Minister Who Changed The Date Of Birth Unanimously That The Time Was Not G-TeluguStop.com

అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ వ్యక్తి ఈ రెండవ రకానికి చెందిన మనిషి.అయితే అందులో కూడా మనోడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఎందుకంటే, టైం కలిసిరాలేదనో, లేదంటే ఎంత శ్రమించినా ఫలితం కనబడటం లేదనో కొందరు తమ పేరుని మార్చుకోవడం మనం చూసి ఉంటాం.అయితే ఇక్కడ ఓ దేశానికి చెందిన ప్రధాని ఏకంగా తన పుట్టినతేదీనే మార్చుకోవడం కూసింత విడ్డురమనే చెప్పుకోవాలి.

ఆశ్చర్యంగా వుంది కదూ, కానీ ఇది నిజమే.అంత ఉన్నతమైన పదవిలో ఉండి అంత మూఢమైన పని చేయడం ఇపుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే, కంబోడియా ప్రధాన మంత్రి హన్ సెన్ పుట్టిన తేది ఏప్రిల్‌ 4, 1951.కానీ ఆయన ఆ తేదీని ఆగస్టు 5, 1952కి చట్టబద్ధంగా మార్చుకోవాలని అనుకుంటున్నాడు.

ఏమిటీ మూర్ఖత్వం అని అనుకుంటున్నారా? అయితే ఇందుకు ఓ బలమైన కారణం చెబుతున్నారు హన్ సెన్.అదేమంటే, హన్‌సెన్‌ సోదరుడు.

సింగపూర్‌లో వైద్యం చేయించుకుని కంబోడియాకు తిరిగి వచ్చిన 10 రోజులకే చనిపోయాడు.

Telugu Day, Cambodia, Changed, Han Sen, Latest-Latest News - Telugu

దీంతో తీవ్రంగా మానసిక క్షోభ చెందిన హన్‌ సెన్‌ అత్యవసరంగా తన డేట్‌ ఆఫ్‌ బర్త్‌ను మార్చుకోవాలని యోచిస్తున్నాడు.అంతేకాకుండా ఈ అనుహ్యమైన నిర్ణయం వెనుక.తన సోదరుడి 2 పుట్టిన రోజుల దోషం కూడా ఉందన్నది వాదిస్తున్నాడు.

అదేమిటో చూసేద్దాం.నిజానికి కంబోడియా 1975 నుంచి 1979 వరకు ఖైమర్‌ రూజ్‌ bekihmjilhlపాలన కాలంలో ఉండేది.

ఆ సమయంలో చాలామంది అధికారిక రికార్డుల కోల్పోయినందున వల్ల 50 ఏళ్లు పైబడ్డ కంబోడియన్లందరికీ రెండేసి చొప్పున పుట్టిన రోజులు ఉండిపోయాయి.అలా తన సోదరుడికి రెండు పుట్టినరోజులు ఉండడం, రాశిచక్రం దోషం వల్ల చనిపోయాడని అనుకుంటున్న హన్‌ సెన్‌ ఇపుడు తనకికూడా ఆ దోషం తగలకూడదని అనుకుంటున్నాడట!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube