చంద్రబాబు కి ప్రధాని ఫోన్ ! ఆ వివరాలపై ఆరా     2018-10-12   11:21:56  IST  Sai M

ఉప్పు నిప్పులా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు – ప్రధాని నరేంద్ర మోదీ మాటలు కలిపారు. చాలా కాలంగా రాజకీయ వైరంతో కేంద్రానికి ఏపీ కి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ ని అధికారంలోకి రానివ్వకూడదు అనే ఏకైక అజెండాతో జనసేన- వైసీపీలతో తెరవెనుక లాలూచి పెట్టుకున్నాడు మోదీ. ఇక బాబు కూడా అదే స్థాయిలో బీజేపీ మీద టార్గెట్ పెట్టి పార్టీ నాయకులతో తిట్టిస్తున్నారు. అంతే కాక ఏపీకి బీజేపీ చాలా అన్యాయం చేసిందని ఏపీ అభివృద్ధి చెందకుండా చేయాలన్నదే బీజేపీ లక్ష్యం అని ప్రచారం చేసుకుంటూ బాబు లభిపొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Prime Minister Phone Call To CM Chandrababu Naidu-

ప్రధాని కేవలం శ్రీకాకుళం జిల్లాలో విరుచుకుపిన తితలి తుపాన్ ప్రభావంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రధానికి అనని వివరాలు అందించారు. నష్టం అంచనాలనూ వివరించారు. ఈ తుపాను ప్రభావం ఒడిషాపై ఎక్కువగా పడింది. ఒడిషా సీఎంకు కూడా..మోడీ ఫోన్ చేశారు. అంటూ టీడీపీ వారాగాలు చెబుతున్నా వారి మధ్య కొన్ని రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ముఖ్యమంత్రికి ఫోన్ చేసి.. వివరాలు అడిగారు తప్ప.. ఫలానా సాయం చేస్తానని మాత్రం చెప్పలేదు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. తుపాన్ వచ్చి ఇంత అల్లకల్లోలం జరిగిన ప్రధాని పట్టించుకోలేదు అనే అపవాదు రాకుండా మాత్రమే ప్రధాని ఫోన్ చేసి చేతులు దులుపుకున్నారని… దీని వల్ల ప్రయోజనం ఏముందని టీడీపీ విమర్శిస్తోంది.

Prime Minister Phone Call To CM Chandrababu Naidu-

ఇక విశాఖపై విరుచుకుపడిన హుదూద్‌ కన్నా భయంకరంగా.. శ్రీకాకుళం జిల్లాపై తితలి తుపాను విరుచుకుపడింది. గంటలకు 150 కిలోమీటర్ల వేగంగా వీచిన గాలులు ఆరు మండలాలను దాదాపుగా తుడిచి పెట్టేశాయ. కరెంట్ స్తంభాలు మాత్రమే కాదు.. చెట్లు పుట్టలన్నీ నేల మట్టమయ్యాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తుల విషయంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఉద్ధానం ప్రాంతంపై ప్రధానంగా తితలి తుపాన్ ప్రభావం పడింది. అక్కడ భారీగా ఆస్తి నష్టం సంభవించంది. గాలులు ఎంత తీవ్రంగా వీచాయంటే.. జాతీయ రహదారిపై కంటెయినర్ లారీలు కూడా. పల్టీలు కొట్టుకుంటూ.. రోడ్డుకు అవతల పడిపోయాయి. నష్టం అంచనా వేయలేని పరిస్థితి అక్కడ ఉంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.