ప్రధాని మోదీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?  

prime minister narendra modi fitness secret, Prime Minister Modi, Narendra Modi, Fitness Secret, PM Mother, Turmeric, Gym - Telugu Devendra Jajariya, Fitness Secret, Gym, Miling, Modi Fitness Secret, Narendra Modi, Pm Mother, Prime Minister Modi, Turmeric, Virat Kohli

ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్‌నెస్ కు ప్రాధాన్యత ఇస్తారనే సంగతి మనందరికీ తెలిసిందే.ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపే మోదీ తాజాగా తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో వెల్లడించారు.

TeluguStop.com - Prime Minister Narendra Modi Fitness Secret

మోదీ ఫిట్‌ ఇండియా కార్యాచరణ మొదలై సంవత్సరం కావడంతో పలువురు క్రీడాకారులు, ఫిట్‌నెస్ నిపుణులతో ముచ్చటించారు.ప్రధాని మాట్లాడుతూ ” ఫిట్‌నెస్ కీ డోస్‌.

ఆధా గంటా రోజ్‌’’ అనే నినాదాన్ని గట్టిగా చెప్పారు.
న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివాకర్‌, క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అఫ్‌షాన్‌ ఆషిక్, బంగారు పతకం విజేత దేవేంద్ర ఝజారియా, తదితరులు మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

TeluguStop.com - ప్రధాని మోదీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

మోదీ చాలామంది ఫిట్‌నెస్ కష్టమని భావిస్తారని.ఆరోగ్యకరమైన ఆహారం, క్రమశిక్షణ మన జీవితంలో భాగం కావాలని పేర్కొన్నారు.మోదీ తన తల్లి వారానికి కనీసం రెండుసార్లు ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి కనుక్కుంటుందని తెలిపారు.

తన తల్లి తప్పనిసరిగా ఒక విషయం గురించి అడుగుతుందని.

ఆహారంలో తగిన మోతాదులో పసుపు తీసుకుంటున్నానో లేదో కనుక్కుంటుందని చెప్పారు.గతంలో కూడా తాను పసుపు గొప్పదనం గురించి చాలసార్లు చెప్పానని.

యాంటీ బయోటిక్ అయిన పసుపు వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు.సూపర్‌ మోడల్‌ మిలింద్‌ సోమన్‌ ను 55 సంవత్సరాల వయస్సులో ఇంత ఫిట్ గా ఎలా ఉన్నారని ప్రశ్నించారు.

మిలింగ్ ఆ ప్రశ్నకు స్పందిస్తూ ఫిట్‌నెస్‌ కోసం జిమ్ లకే వెళ్లాల్సిన అవసరం లేదని.మానసికంగా బలంగా ఉంటే ఫిట్‌నెస్‌ పొందగలమని చెప్పారు.మిలింగ్ మోదీని ప్రధాని హోదాలో ఉంటూ ఎదురవుతున్న ఒత్తిళ్లను ఎలా తట్టుకుంటున్నారని ప్రశ్నించారు.పోటీతత్వం వల్ల ఒత్తిడిని జయించవచ్చని.

ఎలాంటి ఆశ లేకుండా పని చేసే వాళ్లకు ఎలాంటి ఒత్తిడి ఉండదని ప్రశాంతంగా ఉంటుందని అన్నారు.

#PM Mother #Miling #PrimeMinister #Fitness Secret #Turmeric

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prime Minister Narendra Modi Fitness Secret Related Telugu News,Photos/Pics,Images..