నరేంద్ర మోదికి జరిగింది పెళ్లి ... మళ్లీ ....

మన ప్రధాని నరేంద్ర మోదికి ఇప్పటికే ఒకసారి పెళ్లి అయిపొయింది.జశోదాబెన్‌ అనే ఆమెను… 1968లో పెళ్లైంది.

 Prime Minister Narendhra Modi Married Again-TeluguStop.com

అనంతరం మూడేళ్లకు వారు విడిపోయారు.జశోదా ఉపాధ్యాయురాలిగా స్థిరపడిపోగా, మోదీ రాజకీయాల్లో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని అయ్యారు.

అయితే తన వివాహం గురించి కానీ, భార్య గురించి గానీ మోదీ ఎప్పుడూ చెప్పలేదు.మొదటిసారిగా వడోదర స్థానం నుంచి లోక్‌సభకు మోదీ పోటీ చేస్తున్న సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్య పేరు జశోదా బెన్‌ అని తొలిసారి ఆయన బయటకి వెల్లడించాల్సి వచ్చింది.

అయితే ఇప్పుడు మరోసారి ప్రధాని నరేంద్ర మోదికి మళ్లీ పెళ్లి చేసేసారు కొందరు ముస్లిం పెద్దలు.నరేంద్రమోదీకి, ఆయన భార్య జశోదాబెన్‌కు మరోసారి పెళ్లి జరిగిపోయింది.ఈ వివాహానికి ముస్లీంలు పెళ్లి పెద్దలుగా హాజరై దంపతులను ఆశీర్వదించారు.విజయవాడకు చెందిన కొందరు ముస్లీంలు త్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తూ నిరసనగా వచ్చారు.ఇంతలో మోదీ, జశోదాబెన్ మాస్కులతో ఉన్న ఇద్దరు పెళ్లి తరహాలో దండలు మార్చుకున్నారు.తాము త్రిపుల్ తలాక్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.

మోదీకి, త్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన త్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తూ ఈ రకంగా నిరసన వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube