ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ కు రానున్నారు.రేపు మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ల బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.
అయితే పర్యటనలో భాగంగా ముందుగా సికింద్రాబాద్ చేరుకోనున్నారు మోదీ.
ఈ క్రమంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్నారు.పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మోదీ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.
సభా ప్రాంగణంలో దాదాపు గంటన్నర సేపు ఉండనున్నారు.