యోగా లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోడీ..!!

నేడు యోగ ఏడవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ.యోగా ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

 Prime Minister Modi Tells Good News To Yoga Lovers Modi, International Yoga Da-TeluguStop.com

మహమ్మారి కరోనా కష్టకాలంలో యోగా ప్రజలకు ఆశాకిరణంగా మారిందని చెప్పుకొచ్చారు.యోగా ద్వారా అనేక దేశాలు అదేరీతిలో సమాజం మహమ్మారి నుండి తప్పించుకోవటం జరిగిందని, మహమ్మారి తీసుకొచ్చిన కష్టకాలంలో దేశవ్యాప్తంగా చాలా మంది యోగ సాధకులు గా తయారవటం జరిగిందని తెలిపారు.

ఆరోగ్య ప్రమాణంగా యోగాను మరింత ముందుకు తీసుకెళ్లాలని అనేక కార్యక్రమాలు యోగా ద్వారా రూపొందించాలని తెలిపారు.

యోగాను అలవాటు చేసుకోవటం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చని, అదే రీతిలో దీర్ఘకాలిక సమస్యల నుండి మానసికంగా శారీరకంగా ఇంకా అనేక రీతులుగా వచ్చే ఇబ్బందులను యోగా ద్వారా ఎదుర్కోవచ్చు అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

మహమ్మారి కరోనా ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో దానిని ఎదుర్కోవడానికి ప్రపంచంలో ఏ దేశానికి అవగాహన లేదని తెలిపారు.ఈ నేపథ్యంలో WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) ద్వారా ఎం-యోగా యాప్ త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

ఇందులో యోగ కి సంబంధించిన అనేక వీడియోలు లభ్యమవుతాయని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube