ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరికాసేపటిలో తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆయన చేరుకున్నారు.
పాలమూరులో బీజేపీ ప్రజా గర్జన సభకు మోదీ హాజరుకానున్నారు.అయితే సభ కంటే ముందు అధికారిక కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు.ఈ క్రమంలో రూ.13,545 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.ఇందులో భాగంగా జక్లేర్ -కృష్ణా కొత్త రైల్వే లైన్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.కాగా రూ.505 కోట్లతో జక్లేర్ -కృష్ణా రైల్వేలైన్ నిర్మితమైంది.కొత్త రైల్వే లైన్ తో హైదరాబాద్ – గోవా మధ్య 102 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.తరువాత కాచిగూడ – రాయచూర్ రైలును ప్రారంభించనున్న మోదీ రూ.6,404 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు.దాంతో పాటు రూ.2,457 కోట్లతో ఖమ్మం – సూర్యాపేట 4 లైన్ల రోడ్డును ప్రారంభించనున్న మోదీ కర్ణాటక హసన్ నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన గ్యాస్ పైప్ లైన్ ను జాతికి అంకితం ఇవ్వనున్నారు.