Prime Minister Modi : రెండో దశ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ..!!

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.మొత్తం 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.833మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.2.54 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.ఇందుకోసం 26,409 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.

 Prime Minister Modi Exercised His Right To Vote In The Second Phase Of Gujarat A-TeluguStop.com

ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఈ క్రమంలో ప్రధాని మోడీ అహ్మదాబాదులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు వేసిన తర్వాత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల కమిషన్ నీ అభినందించడం జరిగింది.అనంతరం ప్రజాస్వామ్య పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రజలు గొప్పగా జరుపుకుంటున్నారు.

దేశ ప్రజలకు నా అభినందనలు.అలాగే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల సంఘానికి కూడా నా అభినందనలు అని ట్విట్టర్ లో మోడీ పోస్ట్ పెట్టడం జరిగింది.

 ఇంకా అహ్మదాబాద్ లో ఢిల్లీ లెఫ్ట్ హ్యాండ్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీనీ ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.

మరి గుజరాత్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.గుజరాత్ లో వరుసగా బీజేపీ ఆరుసార్లు గెలుస్తూ వచ్చింది.

ఇప్పుడు కూడా గెలిస్తే ఏడోసారి గెలిచినట్లు అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube