ఎయిర్ స్ట్రైక్ నేపధ్యం ప్రధాని అత్యవసర భేటీ!

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ తరహాలో ఎయిర్ స్ట్రైక్ నిర్వహించి ఉగ్ర వాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించిన సంగతి అందరికి తెలిసిందే.ఇక ఈ దాడిని ఇప్పటికే భారత రక్షణ దళం నిర్ధారించింది.

 Prime Minister Modi Emergency Meeting With Ministers-TeluguStop.com

ఇదిలా వుంటే ఈ ఎయిర్ స్ట్రైక్ నేపధ్యంలో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ రక్షణాదళ అధికారులతో అత్యవసరం భేటీ ఏర్పాటు చేసారు.

ఈ సర్జికల్ స్ట్రైక్ గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అలాగే ఈ దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు వున్నాయని ఇంటలిజెన్స్ నుంచి నివేదిక రావడంతో ప్రధాని కీలక మంత్రులతో అత్యవసర బేటీ ఏర్పాటు చేసారు.ఈ బేటీలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తో పాటు రక్షణ శాఖ కీలక అధికారులతో బీటీ అయ్యారు.

ఈ దాడి తర్వాత అంతర్జాతీయంగా ఎలాంటి ఒత్తిడి వస్తుందనే విషయంలో ప్రధాని చర్చించారు.అలాగే సరిహద్దు వెంట అప్రమత్తంగా వుండాలని ప్రధాని రక్షణ మంత్రిత్వ శాఖకి సూచించింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube