జమ్మూకశ్మీర్ నేతలతో ముగిసిన కీలక భేటీ.. ప్రధాని మోదీ ముందు 5 డిమాండ్లు.. !

ఈరోజు ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో జమ్మూ కశ్మీర్ లోని 8 పార్టీలకు చెందిన 14 మంది నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.కాగా కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేశాక తొలిసారిగా అఖిలపక్ష సమావేశం నిర్వహించడం విశేషం.

 Prime Minister Modi Crucial Meeting With Jammu And Kashmir Leaders-TeluguStop.com

దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగియగా ఇందులో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయట.అందులో జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని, కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించాలని, ఇక్కడి ప్రజల ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఎన్నికలు నిర్వహించాలని, అలాగే రాజకీయ ఖైదీలను విడుదల చేయడమే కాకుండా జమ్మూ కశ్మీర్ ప్రజల భూ హక్కులకు భద్రత కల్పించాలనే 5 డిమాండ్లు ప్రధాని ముందు ఉంచారట ఈ భేటీలో పాల్గొన్న అఖిలపక్ష నేతలు.

 Prime Minister Modi Crucial Meeting With Jammu And Kashmir Leaders-జమ్మూకశ్మీర్ నేతలతో ముగిసిన కీలక భేటీ.. ప్రధాని మోదీ ముందు 5 డిమాండ్లు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటుగా, కశ్మీర్ మాజీ సీఎంలు ఫారూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, మరోనేత అల్తాఫ్ బుఖారీ మొదలగు వీరంతా పాల్గొన్నారట.

#Meeting #PM Modi #Leaders #Jammu Kashmir #5 Demands

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు