ఆ రాష్ట్రంలో మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రధాని మోడీ..!! - Prime Minister Modi At The Metro Train Project In The State

modi,metro train projects,gujarath,ahmadabad,surath. - Telugu Ahmadabad, Gujarath, Metro Train Projects, Modi, Surath

ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో మెట్రో ట్రైన్ ప్రాజెక్టులకు సంబంధించి భూమి పూజ చేశారు.గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని మెట్రోరైల్ ప్రాజెక్టు ఫేజ్‌-2కు, సూరత్ మెట్రోరైల్ ప్రాజెక్టుకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దేశంలోనే రెండు ప్రధాన వ్యాపార కేంద్రాలుగా పిలవబడే అహ్మదాబాద్, సూరత్ లలో మెట్రో ప్రాజెక్టుల ద్వారా కనెక్టివిటీ వలన మరింత వ్యాపారాలు జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

తాజాగా మొదలుపెట్టిన రెండు మెట్రో ట్రైన్ ప్రాజెక్టులు రెండు నగరాలలో కీలక మార్పులు తీసుకురావడం గ్యారెంటీ అని ప్రధాని మోడీ తెలిపారు.అంతే కాకుండా దేశ వ్యాప్తంగా మెట్రో రైల్ ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వాలకి  ప్రస్తుత ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు.దేశవ్యాప్తంగా 2014 కు ముందు కేవలం 225 కిలోమీటర్ల మెట్రో ట్రైన్ మాత్రమే ఉండేదని, కానీ ఆరు సంవత్సరాలలో 450 కిలోమీటర్ల మెట్రో లైన్ అందుబాటులోకి రావటం జరిగిందని మోడీ స్పష్టం చేశారు.

 

#MetroTrain #Ahmadabad #Surath #Modi #Gujarath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు