ముసలి వయసులో తండ్రి అవుతున్న ప్రధాని బోరిస్..!

చాలా మందికి పిల్లలు పుట్టకపోవడం పెద్ద ఇబ్బందిగా ఉంటుంది.పిల్లలు పుట్టడం కోసం వారు చాలా మంది డాక్టర్ల దగ్గరికి తిరుగుతుంటారు.

 Prime Minister Boris Becoming A Father In Old Age-TeluguStop.com

అయితే కొందరికి మాత్రం 15 సంవత్సరాలకో, 30 సంవత్సరాలకో పిల్లలు పుట్టిన సందర్భాలు ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి.

ఓ 60 ఏళ్ల ముసలామె కూడా గర్భందాల్చి పిల్లల్ని కన్న ఘటనలు ఉన్నాయి.పిల్లలు పుడితేనే ఆ జన్మకు సార్థకత అని చాలా మంది అంటుంటారు.

 Prime Minister Boris Becoming A Father In Old Age-ముసలి వయసులో తండ్రి అవుతున్న ప్రధాని బోరిస్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ఎన్ని లక్షలు ఖర్చు చేసైనా సరే పిల్లల్ని కనడానికి డాక్టర్ల చుట్టు తిరుగుతుంటారు.చివరికి పిల్లల్ని కని సంతోషంగా జీవిస్తుంటారు.

తాజాగా ఓ ప్రధాని 57 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.

యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ 57 ఏళ్లకు తండ్రి కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.యూకే ప్రధాని సతీమణి అయిన క్యారీ జాన్సన్ ఇంకో బోసి నవ్వుల బుజ్జాయికి జన్మనివ్వనుంది.

రాబోయే డిసెంబరు నెలలో తమ ఇంటికి ఓ కొత్త మనిషి వస్తున్నాడని ఆయన తెలిపారు.అలా ప్రకటిస్తూనే ఇంకో విషయం కూడా చెప్పారు.ఇప్పుడు తనకు కాస్త టెన్షన్ గా ఉందంటూ తెలిపారు.ఇంకోసారి గర్భం దాల్చినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇటువంటి సందర్భంగా కాస్త టెన్షన్ గా కూడా ఉందంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశాడు.

గత సంవత్సరం క్రిస్ మస్ పండగకు ఆమెకు అబార్షన్ అయ్యింది.

Telugu Boris Johnson, Christmas, Second Child, Uk Pm, Viral Latest, Viral News, Wife Expecting-Latest News - Telugu

ఈ సంవత్సరం మొదట్లో జరిగిన ఆ అబార్షన్ వల్ల తమ కుటుంబంలో బాధ తొంగిచూసిందని, కుటుంబం మొత్తం కుంగిపోయామని ఆయన తెలిపాడు.అనేక మంది మహిళల్లో ఫెర్టిలిటీ సమస్యలు అనేవి తలెత్తుతుంటాయని, తన భార్యకు కూడా ఇటువంటిదే తలెత్తిందని ఆయన పేర్కొన్నాడు.మొత్తానికి ఆయన ఇంట్లోకి మరో పసివాడు రానున్నట్లు ఆయన సంతోషం వ్యక్తం చేశాడు.

#Christmas #UK PM #Boris Johnson #Second Child #Wife Expecting

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు