బిజెపి - టిడిపి డీల్ సెట్ అయిందా ?

రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ఎవరూ ఎదురు చూడని సీన్ ఎదురైంది .ఇంతకాలం జగన్ ప్రభుత్వం( YS Jagan Mohan Reddy ) పై పల్లెత్తు మాట అనని కేంద్ర అదికార పార్టీ బిజేపి ఒక్కసారిగా డైరెక్ట్ అటాక్ చేసింది ఈ ప్రభుత్వం మొత్తం అవినీతిమయమే అని తేల్చేసింది.

 Primary Deals Has Been Set In Tdp And Bjp, Ys Jagan Mohan Reddy ,amit Shah , Ch-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం నిధులను తమ నిధులుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారంటూదుయ్యబట్టింది .అయితే ఒక్కసారిగా ఇలా యూటర్న్ తీసుకుని ఎటాక్ చేయడానికి టీడీపీతో కుదిరిన డీల్ ఎఫెక్ట్ ఇదంతా అంటూ అధికార పార్టీ విమర్శలు చేస్తుంది .ఆంధ్రప్రదేశ్లో బిజెపి పరిస్థితి నోటతో పోటీపడే విధంగా ఉంది .

Telugu Amit Shah, Ap, Chandrababu, Ysjagan-Telugu Political News

అయితే తమ టార్గెట్ అసలు ఎమ్మెల్యే స్థానాలే కాదని పొత్తులో భాగంగా ఎన్నిఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పర్వాలేదని కానీ ఎంపీ సీట్లు పై మాత్రమే తమ గురి ఉంటుందని అమిత్ షా చంద్రబాబు బేటీ లో తేల్చి చెప్పేసారట .చంద్రబాబు ( Chandrababu Naidu )కూడా కేంద్రంతో ఉన్న అవసరాల కోసం ఎంపీ సీట్ల విషయంలో ఉదారంగ వ్యవహరించే ఉద్దేశంతోనే ఉన్నారని తద్వారా వారికి ప్రాథమికంగా డీల్ సెట్ అయిందని.ఆ పరిణామాలతోనే ఇప్పుడు జగన్ పై విమర్శలు జోరు పెంచారని విశ్లేషణలు వస్తున్నాయి .వైజాగ్ వేదికగా మాట్లాడిన అమిత్ షా 20 ఎంపీ స్థానాలు టార్గెట్గా పెట్టుకోవాలని పార్టీ శ్రేణులకు టార్గెట్ విధించారు .అయితే పొత్తు లో భాగంగా మెజారిటీ ఎంపీ సీట్లను కోరుకుని ప్రాంతీయ పార్టీల అండతో వాటిని గెలుచుకోవాలని వ్యూహం లో భాజపా ఉన్నట్లుగా తెలుస్తుంది.

Telugu Amit Shah, Ap, Chandrababu, Ysjagan-Telugu Political News

గత ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకున్న వైసిపి తో పొత్తు పెట్టుకున్నా తమకు ఏ ఉపయోగం ఉండదని తెలుగుదేశంతో బేరం చేస్తే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండటంతోనే పాత స్నేహానికి చెల్లు చీటీ పాడి కొత్త స్నేహాల వైపు దృష్టి పెట్టారని వార్తలు వస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవసరం అవకాశం ఉంటుందని వార్తలు వస్తున్న దరిమిలా అవకాశం ఉన్న ఏ ఒక్క స్థానాన్ని కూడా వదులుకోకుండా ప్రయత్నించాలన్న గట్టివిహంతోనే కమలనాధులు ఉన్నారు. వైసిపి స్నేహంతో వచ్చే పరోక్ష మద్దతు కన్నా టిడిపి స్నేహంతో వచ్చే ప్రత్యక్ష గెలుపు పట్ల కమలనాధులు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube