గుడిలో శివలింగానికి కరోనా రాకుండా మాస్క్ పెట్టిన పూజారి.. ఎక్కడో తెలుసా..?  

Priest Puts Face Mask On Idols At Varanasi Temple - Telugu Awareness About Coronavirus, Krishna Anand Pandey, Priest At Varanasi Temple, Putting Masks On Idols

దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కరోనా వ్యాప్తి చెందకుండా అప్రమత్తమయ్యాయి.

 Priest Puts Face Mask On Idols At Varanasi Temple

ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి 4,000 మందికి పైగా మృతి చెందగా 1,16,000 మంది కరోనా బారిన పడ్డారు.చాలా మంది కరోనాకు భయపడి హోలీ పండగ జరుపుకోలేదు.

చాలా మంది ప్రజలు కరోనాకు భయపడి ఇళ్ల నుండి బయటకు రావడమే మానేశారు.

గుడిలో శివలింగానికి కరోనా రాకుండా మాస్క్ పెట్టిన పూజారి.. ఎక్కడో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image

కరోనా వైరస్ మనుషుల నుండి మనుషులకు సోకుతుందనే విషయం తెలిసిందే.

మరో దేవుళ్లకు కరోనా సోకుతుందా.? అని ఎవరైనా అడిగితే ఆ ప్రశ్న వినడానికే చాలా వింతగా అనిపిస్తుంది.కానీ వారణాసిలోని ఒక పూజారి ప్రహ్లాదేశ్వర్ ఆలయంలోని శివ లింగానికి మాస్క్ తొడిగాడు.దేవుడికి కరోనా సోకకుండా మాస్క్ పెట్టడం ఏమిటని ప్రశ్నించగా పూజారి చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోవడం భక్తుల వంతయింది.

క్రిష్ణ ఆనంద్ అనే ఆలయ పూజారి చలికాలంలో దేవుళ్లకు చలి పెట్టకుండా వస్త్రాలు కప్పుతామని….వేసవిలో దేవునికి ఫ్యాన్ పెడతామని… వైరస్ దేవుడికి వ్యాపించకుండా తాను మాస్క్ పెట్టానని అన్నారు.

ఆలయానికి వచ్చే భక్తులు దూరం నుండే లింగాన్ని దర్శించుకోవాలని దగ్గరకు వెళ్లి ముట్టుకోకూడదని సూచించారు.నెటిజన్లు శివలింగానికి మాస్కు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Priest Puts Face Mask On Idols At Varanasi Temple Related Telugu News,Photos/Pics,Images..

footer-test