నిబంధనలు ఉల్లంఘించిన చర్చ్ ఫాస్టర్, అరెస్ట్

ఆదివారం(22వ తేదీ)న భారత ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ పాటించాలి అంటూ కోరిన సంగతి తెలిసిందే.దీనితో రాష్ట్రాలు అన్ని కూడా ఈ జనతా కర్ఫ్యూ ను చాలా స్ట్రిక్టుగా పాటించారు.

 Priest Arrested For Conducting Mass At A Church In Kerala-TeluguStop.com

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలి అని రాష్ట్ర సీఎం లు కోరారు.మరోపక్కకరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమదైన శైలి లో నిబంధనలు విధించారు.

అయితే రాష్ట్ర నిబంధనలను ఉల్లఘించి ప్రార్ధనలు నిర్వహించిన ఒక చర్చి ఫాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ ఘటన కేరళరాష్ట్రంలో చోటుచేసుకుంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ ఆదేశాలను పట్టించుకోకుండా జన సమూహంతో ప్రార్థనలు నిర్వహించి నందుకుగాను సదరు ఫాస్టర్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

కేరళ సీఎం పినరయి విజయన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్రంలోని అన్ని బార్‌లను మూసివేస్తూ అక్కడి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అలానే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మద్యం దుకాణాలపై కూడా బ్యాన్‌ కొనసాగుతుందన్నట్లు అధికారులు తెలిపారు.మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు జనతా కర్ఫ్యూ ను సమర్ధవంతంగా పాటించినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube