ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కరోనా టీకాల ధరలు.. !- Prices Of Various Corona Vaccines Around The

covid vaccines cost, world wide, corona vaccine, prices, like this - Telugu Corona Vaccine, Like This, Prices, World Wide

దేశవ్యాప్తంగా కరోనా చేస్తున్న విధ్వంసం వల్ల మరణిస్తున్న వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉన్న విషయం తెలుస్తుంది.ఇక కోవిడ్ ఫస్ట్ వేవ్ నుండి తప్పించుకున్న వారిని ఈ సెకండ్ వేవ్ మాత్రం విడిచి పెట్టడం లేదు.

 Prices Of Various Corona Vaccines Around The-TeluguStop.com

ఈ క్రమంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది.

ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా టీకా అందించేందుకు సిద్దం అవుతుంది.

 Prices Of Various Corona Vaccines Around The-ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కరోనా టీకాల ధరలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే, దేశీయంగా టీకాల కొరత ఉండడంతో, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాల ధరలు ఎలా ఉన్నాయో తేలుసుకుంటే.

ఫైజర్‌ బయోఎన్‌టెక్ బీఎన్‌టీ162బీ2 వ్యాక్సిన్ ‌ధర అమెరికాలో ఒక్కో డోసుకు 19.50 డాలర్లు.ఐరోపా లో ఒక్కో డోసును 14.70 డాలర్లకు అందిస్తున్నారు.ఇక ఇజ్రాయెల్‌ ఏకంగా ఒక్కో డోసుకు 30 డాలర్లు చెల్లిస్తోంది.కాగా ఈ టీకాను ప్రస్తుతం యూకే, అమెరికా, కెనడా, జపాన్‌ తో సహా మరికొన్ని దేశాలు ఉపయోగిస్తున్నాయి.

ఇకపోతే మోడెర్నా ఎంఆర్‌ఎన్‌ఏ-1273 వ్యాక్సిన్.అమెరికాలో ఒక్కో డోసుకు 25-37 డాలర్ల మధ్య ఉండగా, ప్రస్తుతం దీనిని యూకే, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్‌లో వినియోగిస్తున్నారు.

ఇక మరో టీకా స్పుత్నిక్‌-వి.రష్యా అభివృద్ధి చేసిన ఈ టీకా వినియోగానికి భారత్‌లో కూడా అనుమతి లభించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 60 దేశాలు ఈ టీకా వినియోగానికి ఆమోదం తెలిపాయి.దీని ధర ఒక్కో డోసుకు పది డాలర్లు లేదా రూ.750గా ఉంది.
మరో వ్యాక్సిన్ జాన్సన్‌ అండ్‌ జాన్సన్.ఒక్క సారే ఊపయోగించే ఈ వ్యాక్సిన్ పది డాలర్లు లేదా రూ.750గా నిర్ణయించారు.ఇకపోతే ‌ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.28 రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉన్న ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో డోసును రూ.200 అందిస్తున్నారు.ఐరోపా సమాఖ్య 2.15 డాలర్లు చెల్లిస్తుండగా.దక్షిణాఫ్రికా 5.25 డాలర్లు వెచ్చిస్తోంది.

ఇకపోతే ‌దేశీయంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, ఐసీఎంఆర్‌ సహకారంతో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ ధర ఒక్కో డోసుకు రూ.206గా ఉంది.ఇదండీ ప్రస్తుతం అమలులో ఉన్న టీకాల ధరల వివరాలు.

#World Wide #Prices #Corona Vaccine #Like This

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు