రేటు తక్కువైతే తప్పు కాదంటున్న సారా అలీఖాన్..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను అందుకున్న సెలబ్రిటీలు దుస్తులు, వస్తువుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.కొంతమంది సెలబ్రిటీలు అయితే లక్షల్లో ఖరీదు చేసే దుస్తులు, వస్తువులను మాత్రమే వాడతారు.

 Price Does Not Matter But Comfort Is More Important Sara Ali Khan-TeluguStop.com

అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీఖాన్ మాత్రం తాను ఎక్కువ ఖరీదు చేసే వస్తువులతో పాటు తక్కువ ఖరీదు చేసే వస్తువులను కూడా ఇష్టపడతానని చెప్పారు.

నటిగా ఎంతో పాపులారిటీ, గుర్తింపు ఉన్నా ఒదిగి ఉండే సారా అలీ ఖాన్ నటించింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో గుర్తింపును సంపాదించుకున్నారు.

 Price Does Not Matter But Comfort Is More Important Sara Ali Khan-రేటు తక్కువైతే తప్పు కాదంటున్న సారా అలీఖాన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక్కో సమయంలో ఒక్కో రకం దుస్తుల్లో కనిపించే సారా అలీఖాన్ కొన్నిసార్లు ఖరీదైన దుస్తుల్లో కనిపిస్తే మరి కొన్నిసార్లు కాటన్ దుస్తుల్లో కూడా కనిపించి మెప్పించారు.గ్రాండ్ లుక్ లో దర్శనమివ్వాలని సారా అలీఖాన్ ఎక్కువగా ప్రయత్నం చేయరు.

Telugu Attitude, Comfort, Nepotism, Not Matter, Price, Rate Does Not Matter, Saif Ali Khan, Sara Ali Khan, Star Celebrity, Summer Clothes-Movie

మరికొన్ని రోజుల్లో వేసవికాలం రానున్న నేపథ్యంలో వేసవిలో ఎలాంటి దుస్తులు ధరించాలో చెబుతూ సారా అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వేసవిలో ధరించే దుస్తుల విషయంలో కంఫర్ట్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని సారా అలీఖాన్ చెప్పుకొచ్చారు.తను కొనుగోలు చేసే దుస్తుల్లో 500, 1000 రూపాయల దుస్తులు కూడా ఉంటాయని ఆమె అన్నారు.అమ్మాయిలకు సారా అలీఖాన్ ముఖ్యమైన సూచనలు చేశారు.

మిగతా హీరోయిన్లకు భిన్నంగా సారా అలీఖాన్ భిన్నంగా కనిపిస్తూ ఉండటం గమనార్హం.సినిమాల ఎంపిక, యాటిట్యూడ్ విషయంలో సారా అలీఖాన్ భిన్నమనే చెప్పాలి.

భవిష్యత్తులో తెలుగులో అవకాశాలు వస్తే సారా తెలుగు సినిమాల్లో కూడా నటించే అవకాశం ఉంటుంది.కొత్త హీరోయిన్ల నుంచి ఎంత పోటీ ఎదురవుతున్నా సారా అలీఖాన్ మాత్రం అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం.

స్టార్ సెలబ్రిటీ అయినా కించిత్ గర్వం లేకుండా ఉండటంతో నెపోటిజం విషయంలో పలువురు సెలబ్రిటీలపై విమర్శలు వ్యక్తమైనా సారా అలీఖాన్ పై మాత్రం విమర్శలు వ్యక్తం కాలేదు.

#Summer Clothes #Star Celebrity #Attitude #Comfort #Sara Ali Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు