భారత్ లో లాక్ డౌన్ పెట్టాల్సిందే ! ప్రపంచ దేశాల ఒత్తిడి ?

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారని అందరూ అంచనా వేయగా, కేంద్రం మాత్రం ఆ ఆలోచన లేదని ప్రకటించింది.

 Countries Demands Lockdown In India,india, Corona Positive Cases, Covid, Flights-TeluguStop.com

పైగా లాక్ డౌన్ విధించే నిర్ణయాలను రాష్ట్రాలకు వదిలివేయడంతో, రాష్ట్రాలే ఆ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి.అయితే చాలా రాష్ట్రాల్లో పరిస్థితి చేయిదాటిపోవడంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేయగానే, మరికొన్ని రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు కారణంగా లాక్ డౌన్ విధించేందుకు సిద్ధంగా లేదు.

దీంతో సంఖ్య మరింతగా పెరుగుతూ వస్తున్నాయి.దాదాపు రోజుకు నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, ఆసుపత్రులలో బెడ్ ల కొరత, ఇలా ఎన్నో కారణాలతో భారత్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది.


ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు భారత్ కు రాకపోకలపై నిషేధం విధించాయి.

అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత్ లో లాక్ డౌన్ విధించాలనే డిమాండ్ పెరిగిపోతున్నాయి.చాలా దేశాలు ఇదొక్కటే ఒకటే మార్గమని, కనీసం ఆరు నెలలపాటు లాక్ డౌన్ విధించాలని ఒత్తిడి చేస్తుండగా, ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయని భారత్ చెబుతుండడంతో కనీసం కొన్ని వారాల పాటు లాక్ డౌన్ విధిస్తే పర్తి స్థాయిలో కాకపోయినా, కొంత ఉపశమనం కలుగుతుందని అభిప్రాయాన్ని ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటికే భారత్ లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉందని, వ్యాక్సిన్ సైతం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని, 130 కోట్ల పైగా ఉన్న జనాభాలో కేవలం 2 శాతం మందికి మాత్రమే వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది అనే విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తు చేస్తున్నాయి.


Telugu America, Anthony Fauci, Carona, Corona, Lockdown India, Covid, Flights Ba

వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని, అప్పటికి పరిస్థితి చేయి దాటిపోతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అలాగే ఆక్సిజన్ కొరత విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.ఇప్పటికే అమెరికా చీఫ్ మెడికల్ సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫాచి భారత్ లో లాక్ డౌన్ విధించడమే ప్రస్తుత తరుణంలో ఏకైక మార్గం అంటూ ప్రకటించడం తో భారత్ పై ఒత్తిడి మరింతగా పెరిగిపోతోంది.

ప్రపంచ దేశాల ఒత్తిడితో కేంద్రం తన నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube