వెస్ట్ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన, మమత సర్కార్ కు ఫుల్ స్టాప్ పడనుందా  

President\'s Rule In West Bengal-

వెస్ట్ బెంగాల్ లో ఇక మమత సర్కార్ లేనట్టేనా.రాష్ట్రపతి పాలన విధించనున్నారా అని ప్రశ్నిస్తే నిజమే అన్నట్లు వార్తలు వస్తున్నాయి...

President\'s Rule In West Bengal--President's Rule In West Bengal-

అక్కడ హింస రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా ఆర్టికల్ 356ని ప్రయోగించే పరిస్థితి వస్తుందని దీనితో అక్కడ రాష్ట్రపతి పాలన తప్పదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.గత కొద్దీ కాలంగా వెస్ట్ బెంగాల్ ధర్నాలు, ర్యాలీలతో రావణ కాష్టంలా మారింది.సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా.టీఎంసీ, బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం లో మాత్రం ఎలాంటి మార్పురావడం లేదు.దీనితో అక్కడ రోజురోజుకు హింస పెరిగిపోతుంది.బుధవారం బీజేపీ జరిపిన ర్యాలీ లో కూడా ఉద్రిక్తత చోటుచేసుకోవడం తో ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలనే దిక్కు అన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఎన్నికల తర్వాత జరిగిన హింసలో దాదాపు 15 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం తో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ కమలాపాటి త్రిపాఠి అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది.అయితే ఈ రోజు జరగబోయే ఈ భేటీ లో పలు అంశాల పై గవర్నర్ చర్చించి, రిపోర్ట్ ను కేంద్రానికి పంపించనున్నారు.దీనితో ఈ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

President\'s Rule In West Bengal--President's Rule In West Bengal-