బంగారు కుక్క విగ్రహాన్ని చౌరస్తాలో ఆవిష్కరించిన దేశ అధ్యక్షుడు..!

మనదేశంలో నగరాల్లో, పల్లెటూర్లో కానీ ఎక్కడైనా సరే రోడ్ల కూడలిలో ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను పెడుతూ ఉండడం గమనిస్తాం.అయితే ఇలా కేవలం మన దేశంలో మాత్రమే కాదు చాలా దేశాల్లో కూడా వారి దేశానికి సంబంధించి పోరాటం చేసిన వారి విగ్రహాలను పెడుతుంటారూ.

 Dog, Statue, 4 Roads Junction, Gold Dog Statue, Social Media, Turkmenistan, Gole-TeluguStop.com

అయితే ఏప్పుడైనా అలాంటి చోట్ల లో కుక్క విగ్రహం మీరు ఎప్పుడైనా చూసారా.? అది కూడా బంగారు కుక్క విగ్రహం.ఇక అసలు విషయంలోకి వెళితే.

తుర్క్ మెనిస్తాన్ దేశ రాజధాని అష్కాభట్‌లో అత్యంత బిజీగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో పది అడుగుల ఎత్తు ఉన్న బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అక్కడి పాలకులు.

అంతేకాదు ఆ విగ్రహాన్ని స్వయంగా ఆ దేశానికి చెందిన అధ్యక్షుడు గుర్బంగూలీ బెర్డిముఖమదోవ్ ఆ కుక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.అయితే దీనికి కారణం లేకపోలేదు.

అలబాయ్ అనే జాతికి చెందిన కుక్కలు ఆ దేశానికి పెట్టింది పేరు.అలాంటి కుక్క జాతి సంపదను ఆ దేశ ప్రజలు జాతీయ సంపదగా భావిస్తుంటారు.

ఆ జాతికి చెందిన కుక్కలు అంటే ఆ దేశ అధ్యక్షుడు కి చెప్పలేని ప్రేమ.అది ఎంతలా అంటే క్రితం సంవత్సరం ఏకంగా ఆ జాతి కుక్కల పై ఓ పుస్తకాన్ని తానే స్వయంగా రాసి దాన్ని జాతికి అంకితం చేశాడు.

అంతేకాదు ఆ దేశ అధ్యక్షుడు ఆ కుక్కలపై కవిత్వాన్ని కూడా రచించి కవిత్వం రాసిన మొదటి అధ్యక్షుడిగా ఆయన చరిత్రకెక్కారు.

Telugu Roads, Gold Dog Statue, Statue-Latest News - Telugu

ఇకపోతే ఆ దేశంలో కుక్కల పోటీలు కూడా బాగా ప్రసిద్ధి. కుక్కల పోటీలు అక్కడ పెద్ద వినోద క్రీడగా జరుపుకుంటారు.ఈ కుక్కల జాతి ఎంతో భయంకరమైనది.

మేకలు, గొర్రెలు కాపరులకు ఇవి చాలా ఉపయోగపడతాయి.ఈ కుక్కల జాతి బాగా విశ్వాసం గా ఉంటాయి.

అందుకే ఇక్కడి ప్రజల జీవితాల్లో ఇవి భాగస్వాములు అయిపోయాయి.ఇకపోతే ఈ బంగారు కుక్కకు సంబంధించి ఖర్చులు మాత్రం అధికారికంగా ఆ దేశ ప్రభుత్వం ప్రకటించలేదు.

కేవలం 60 లక్షలు ఉన్న ఆ దేశ జనాభా గుర్రాలను, కుక్కలను ఎంతగానో ప్రేమతో పెంచుకుంటారు.పూర్తిగా ఎడారి దేశమైన ఈ దేశం సోవియట్ దేశాలలో ఒకటి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube