ఏపీలో శిరోముండనం ఘటనపై స్పందించిన రాష్ట్రపతి..!

ఏపీలో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన ఘటనపై రాష్ట్రపతి రామ్‎నాథ్ కోవింద్ స్పందించారు.ఈ శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి రామ్‎నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Andra Pradesh, Siromundanam Case, President Office, President Ramnath Kovind, Ea-TeluguStop.com

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి బాధితుడికి అండగా నిలిచేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమించినట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబును కలవాలని.

, కేసు విషయంలో ఆయనకు సహకరించాలని బాధితుడు వరప్రసాద్ కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది.

ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు తనను కొట్టి శిరోముండనం చేయించారని.

, తనకు న్యాయం జరగాలని కోరుతూ బాధితుడు వరప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశారు.తనకు న్యాయం చేయకపోతే మావోయిస్టుల్లో కలిసిపోతానని వరప్రసాద్ లేఖలో పేర్కొన్నారు.

ఈ ఘటనపై కారణమైన వైసీపీ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు వరప్రసాద్ వాపోయారు.తాజాగా దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.

బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.అయితే దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం అందించింది.

తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైసీపీ నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవల వెదుళపల్లిలో వరప్రసాద్ అనే దళిత యువకుడిని అరెస్ట్ చేశారు.ప్రసాద్ ను తీవ్రంగా కొట్టడంతో పాటు పోలీసు స్టేషన్ లో యువకుడికి శిరోముండనం చేశారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసులో ఎస్ఐతో పాటు ఓ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసినట్లు పోలీసు శాఖ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube