కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్ర‌ప‌తి.. !

దేశంలో కరోనా వ్యాక్సిన్ మొదట ప్రారంభించినప్పుడు చాలా మందిలో ఈ వ్యాక్సిన్ పట్ల భయం ఉండేది.కానీ ప్రస్తుతం దేశంలోని ప్రముఖులంతా ఈ టీకా తీసుకుంటున్న నేపధ్యంలో ప్రజల్లో క్రమక్రమంగా నమ్మకం ఏర్పడుతుంది.

 President Ram Nath Kovind Receives First Dose Of Covid19 Vaccine-TeluguStop.com

ఇక ఈనెల 1వ తారీఖు నుండి వ్యాక్సిన్ పక్రియ వేగవంతంగా సాగుతుంది.ఈ క్రమంలో ప్ర‌ధాని మోదీతో పాటు కొంద‌రు కేంద్ర మంత్రులు ఇప్ప‌టికే కోవిడ్ టీకాను తీసుకున్నారు.

ఆయా రాష్ట్రాల సీఎంలు, మంత్రులు కూడా టీకాలు వేయించుకున్నారు.

 President Ram Nath Kovind Receives First Dose Of Covid19 Vaccine-కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్ర‌ప‌తి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిత్రపరిశ్రమలోని ప్రముఖులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఇకపోతే రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు.ఈయన తన తొలి డోసు టీకాను ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిట‌ల్‌లో వేయించుకున్నారు.

ఇక ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా టీకాలు ఇస్తున్నారు.అలాగే 45 ఏళ్లు దాటి వ్యాధులు ఉన్న‌వారికి కూడా ప్ర‌భుత్వ ద‌వాఖానాల్లో ఉచిత టీకాల‌ను ఇస్తున్నారు.

కాగా కరోనా టీకాలు తీసుకోవాల‌నుకునే వారు తొలుత కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మరవకండి…

#Ram Nath #President #COVID19 #Rr Hospital #Govind

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు