అమెరికా అధ్యక్ష రేసులో నేను సైతం..  

అమెరికా అధ్యక్ష ఎన్నికలకి రోజు రోజుకి పోటీ పెరిగిపోతోంది.రానున్న ఎన్నికల్లో పోటాపోటీగా ఉండనున్నాయి అంటున్నారు పరిశీలకులు. ఈ మధ్య కాలంలోనే డెమోక్రాటిక్ పార్టీ నుంచీ ఇద్దరు భారతీయ అమెరికన్ మహిళలు పోటీ పడుతున్నట్టుగా తెలుపగా. తాజాగా మరొక వ్యక్తి పేరు కూడా తెరపైకి రావడం గమనార్హం. ట్రంప్ పై నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ స్టార్ బాక్స్ మాజీ

President Race Together Says Howard Schultz-H1b Visa H4 Howard Schultz Nri Telugu Nri News Updates

President Race Together Says Howard Schultz

సీఈవో స్కల్జ్ వెల్లడించారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలుపు తనదే అంటూ ప్రకటించారు కూడా. అయితే తానూ ఏ పార్టీ తరుపునా పోటీ చేయనని తప్పకుండా వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానని కూడా ప్రకటించారు.

అయితే ఇప్పటివరకూ అధ్యక్ష పదవిని చేపట్టిన ఇరు పార్టీలు అయిన డెమోక్రాట్స్‌, రిపబ్లిక్ ప్రజలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయానని ఘాటుగా స్పందించారు.

President Race Together Says Howard Schultz-H1b Visa H4 Howard Schultz Nri Telugu Nri News Updates

ఆ రెండు పార్టీలు పూర్తిగా విఫలం అయ్యాయి కాబట్టే తానూ స్వతంత్రంగా పోటీ చేయనున్నాని ఆయన తెలిపారు.. బిలియనీర్‌ స్కల్జ్‌ పోటీ గనుకా చేస్తే అది ట్రంప్ కి కలిసొచ్చే అంశం అని, స్కల్జ్ పోటీలో రాజకీయ కోణం ఉందా అనేట్టుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.