కేటీఆర్ కు అధ్యక్ష పదవి ? ఆ పదవుల భర్తీపై  కేసీఆర్ ఫోకస్ ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కాస్త ఇప్పుడు బీఆర్ ఎస్ గా మారిపోయింది.పూర్తిగా జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించబోతున్నారు .

 President Post For Ktr  Kcr Focus On Filling Those Posts ,brs, Trs, Kcr, Ktr,tel-TeluguStop.com

టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిపోవడంతో ప్రస్తుతం పార్టీలో ఉన్న పదవులు అన్ని రద్దు అవుతాయి .దీంతో ఇప్పుడు కొత్తగా పదవులను భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.జాతీయ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నియామకం , రాష్ట్ర కమిటీలు ఇలా భారీ తతంగమే ఉంది.పూర్తిగా దీనిపైనే కేసీఆర్ దృష్టి పెట్టారు.ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు బీఆర్ఎస్ లో ఏ పదవి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

కెసిఆర్ పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించబోతున్న నేపథ్యంలో, కేటీఆర్ ను బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది.

రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులు ఎంపికలో కేటీఆర్ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉండడంతో, కేటీఆర్ కు ఆ బాధ్యతలు ఇవ్వడమే సరైనదనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారట.అందుకే ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ కమిటీలోను కేటీఆర్ మార్క్ కనిపించే విధంగా ఆయనకు సన్నిహితులైన వారికి ఎక్కువ పదవులను కేటాయించే అవకాశం ఉన్నట్లుగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంపిక తో సహా అన్ని వ్యవహారాలను కేటీఆర్ చూసుకోబోతుండడం తో ఆయనకు అనుకూలంగా ఉండే వ్యక్తులను పార్టీ కమిటీల్లో నియమించే అవకాశం ఉందట.దీంతోపాటు జాతీయస్థాయిలో కమిటీ ఏర్పాటు పైన కెసిఆర్ దృష్టి సారించారు.
 

Telugu Brs Telangana, Kcrnational, Telangana Cm, Vinod Kumar-Political

జాతీయ కమిటీల్లో ప్రస్తుత తెలంగాణ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశాంత్ రెడ్డిలకు ప్రాధాన్యం దక్కబోతోందట.అలాగే ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా ఉన్న వినోద్ కుమార్ కు బీఆర్ఎస్ ఢిల్లీ ఇంఛార్జి గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందట.దీంతోపాటు ప్రస్తుతం ఢిల్లీలో పార్టీ ఆఫీసుకు తెలంగాణ భవన్ గా నామకరణం చేయగా, ఇప్పుడు దానిని బీఆర్ఎస్ భవన్ గా మార్చబోతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube