తెలంగాణ టిడిపి అధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని ?  

Nandamuri Suhasini To Be President Of Telangana Tdp-kcr,ktr,nandamuri Suhasini,president Of Telangana Tdp,telangana Congress,telangna Tdp,trs,నందమూరి సుహాసిని

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పునర్వైభవం కోసం ఆరాటపడుతున్న సమయంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడం తెలంగాణ టీడీపీని మరింతగా కుంగదీసింది.ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకోవడానికి తప్ప ఆ పార్టీ గురించి పెద్దగా ఎవరు పట్టించుకోని పరిస్థితి.

Nandamuri Suhasini To Be President Of Telangana TDP-Kcr Ktr Nandamuri President Tdp Telangana Congress Telangna Trs నందమూరి సుహాసిని

ఏపీలో పార్టీ పరిస్థితిపై అందరికి అనుమానం పెరుగుతున్న క్రమంలో తెలంగాణలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.దీనిలో భాగంగా తెలంగా తెలంగాణ టీడీపీలో మార్పు చేర్పులు చేయడం ద్వారా పార్టీకి మంచి ఊపు తీసుకురావాలని భావనలో అధినేత చంద్రబాబు ఉన్నారు.

దీనిలో భాగంగానే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఏపీ, తెలంగాణలో పార్టీకి మేలు చేకూరుతుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.ఈ పరిస్థితుల్లో నందమూరి సుహాసిని పేరు వస్తోంది ఎన్టీఆర్ మనవరాలిగా తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఫలితం అభిప్రాయానికి అధినేత వచ్చినట్లు సమాచారం.

కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన నందమూరి సుహాసినికి రాజకీయాలు కొత్త.నందమూరి హరికృష్ణ మరణం తర్వాత ఆమె క్రియాశీలకంగా రాజకీయాల్లో పాల్గొన్నది ఎప్పుడూ లేదు.

ఎన్నికల్లో ఓటమి చెందినా ఆమె రెండు రాష్ట్రాల్లో మంచి పలుకుబడి సాధించారు.

అంతే కాకుండా ఆమెకు ఎన్టీఆర్ మనవరాలిగా గుర్తింపు ఉంది.ఇక ఈ మధ్య తెలంగాణ టిడిపి కార్యక్రమంలోనూ ఆమె పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో ఆమెకు తెలంగాణ టీడీపీ బాధ్యతలు అప్పగిస్తే సానుభూతితో పాటు ఎన్టీఆర్ కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చినట్టుగా ఉంటుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట.ఈ మేరకు ఆమెకు టీటీడీపీ బాధ్యతలు అప్పగించేందుకు తెలంగాణ పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు సమాచారం.

తాజా వార్తలు

Nandamuri Suhasini To Be President Of Telangana Tdp-kcr,ktr,nandamuri Suhasini,president Of Telangana Tdp,telangana Congress,telangna Tdp,trs,నందమూరి సుహాసిని Related....