మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని( CM YS Jaganmohan Reddy ) రహేజా గ్రూపు ప్రెసిడెంట్.కె నీల్ రహేజా కలవడం జరిగింది.
విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని రహేజా గ్రూప్ సంస్థ( Raheja Group Company ) ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ ని ఆహ్వానించడం జరిగింది.విశాఖలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇనార్బిట్ మాల్ నిర్మించనున్నారు.
ఇదిలా ఉంటే వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో రహేజా గ్రూప్ ₹600 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయింది.
ఈ క్రమంలో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ముఖ్యమంత్రి జగన్ తో.రహేజా గ్రూప్ ప్రతినిధులు చర్చించడం జరిగింది.ఈ సమావేశంలో.
ఇనార్బిట్ మాల్స్ సీఈవో రజనీష్ మహాజన్( Rajneesh Mahajan ), కె రహేజా గ్రూప్ ఆంధ్ర, తెలంగాణ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనే శ్రావణ్ కుమార్ తో పాటు పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ లు పాల్గొనడం జరిగింది.