బిడెన్ కీలక నిర్ణయం : అమెరికాలో కొత్త చట్టం.....మహిళలకు భారీ ఊరట...!!

ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై దాడులు జరగడం, వారిని లైంఘికంగా వేధించడం ఆ తరువాత వారు నోరు మెదపకుండా సెటిల్మెంట్లు చేయడం రోజు వారి కార్యక్రమంలో ఏదో ఓ మూల జరుగుతూనే ఉంటుంది.ఇందులో అగ్రరాజ్యం అమెరికా ఏమి మినహాయింపు కాదు.

 President Joe Biden Signs Ending Forced Arbitration Of Sexual Assault Act, Joe B-TeluguStop.com

ఆ మాటకొస్తే అమెరికాలోనే మహిళలపై అత్యధికంగా లైంఘిక దాడులు ఆ తరువాత వారిని కూర్చోబెట్టి నయానో భయానో వారి నోళ్ళు మూయిస్తారట.ఎందుకంటే ఈ తరహా ఘటనలు జరిగేవి ముఖ్యంగా ఉద్యోగాలు చేసే చోట మాత్రమే.

దాంతో వారి మాట వినకపోతే ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయోనని భయాందోళనలతో రాజీలు కుదుర్చుకుని మరీ మనసు చంపుకుని ఉద్యోగాలు చేస్తున్నారట.అయితే

అమెరికాలో ఈ పరిస్థితిని రూపు మాపాలని కమలా హారీస్ ఐదేళ్ళ క్రితమే ఓ చట్టానికి రూప కల్పన చేశారు.

ఈ చట్టం ప్రకారం మహిళలు హింసకు, లైంఘిక దాడులకు గురైతే వారు రాజీకి కాకుండా కోర్టులకు వెళ్లి తమకు న్యాయం అడగవచ్చు, ఇందులో మహిళలు ఎలాంటి భయందోళనలకు గురవ్వకుండా పూర్తి భద్రతగా ఉండవచ్చునని కమలా హారీస్ చట్టాన్ని ప్రవేశపెట్టారు.అయితే అప్పటి చట్టం ఇప్పుడు తాజాగా బిడెన్ సంతకంతో అమలు లోకి వచ్చింది.

ట్రంప్ హయాంలో ఈ చట్టానికి ఆమోదం దొరకలేదు, దాంతో బిడెన్ ఈ చట్టాన్ని మహిళల రక్షణ కోసం ప్రవేశపెడుతునట్టుగా తెలిపారు.

లైంఘిక హింస, వేధింపుల్లో ఇకపై బలవంతపు మధ్య వర్తిత్వం అనే ఈ చట్టం -2021 మహిళలకు బలమైన భద్రతను ఇస్తుందని, కంపెనీలు ఉద్యోగాల నుంచీ తొలగించకుండా ఉండేలా ఉద్యోగ భద్రతను కూడా ఇస్తుందని అధికారులు ప్రకటించారు.అమెరికా వ్యాప్తంగా సుమారు 60 మిలియన్ల మంది మహిళా కార్మికులు బలవంతపు మధ్యవర్తిత్వానికి గురవుతున్నారని వారికి ఈ చట్టం పూర్తిస్థాయి భద్రతను ఇస్తుందని నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ చట్టంపై అమెరికా వ్యాప్తంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube