ట్రంప్ బాటలో బిడెన్...రిపబ్లికన్స్ ఫుల్ కుషీ..!!!

బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత తన మొట్ట మొదటి బడ్జెట్ పై ముందు నుంచీ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బిడెన్ బడ్జెట్ ఎవరెవరికి మేలు చేస్తోంది.

 Joe Biden First America Budget Proposal, America Budget ,joe Biden,donald Trump-TeluguStop.com

ఏ అంశానికి బిడెన్ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు అనే విషయాలపై పలు చర్చలు కూడా నిర్వహించారు.అయితే తాజాగా బిడెన్ విడుదల చేసిన తన మొదటి బడ్జెట్ లో బిడెన్ గతంలో ట్రంప్ అనుసరించిన బాటలోనే వెళ్ళారు.

అది కేవలం ఒక్క విషయంలో మాత్రమే.

ట్రంప్ తన హయాంలో బడ్జెట్ లో మిలటరీ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు.

అమెరికాకు ఉన్న అత్యంత పటిష్టమైన మిలటరీకు నిధులు కేటాయించడంలో ట్రంప్ వెనకాడే వారు కాదు.ఇప్పుడు బిడెన్ కూడా తన బడ్జెట్ లో మిలటరీకు నిధుల వరద పారించారని అంటున్నారు నిపుణులు.

మిలటరీకు బిడెన్ పెద్దపీట వేశారని కానీ కరోనా సంక్షోభంతో అమెరికా ఆర్ధిక పరిస్థితులు పతనమై, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ దిశగా సంస్కరణలు చేయాల్సింది పోయి మిలటరీకి భారీగా నిధులు ఇవ్వడంపై కొందరు డెమోక్రటిక్ నేతల నుంచీ విమర్శలు ఎదురవుతున్నాయి.ఇదిలాఉంటే

Telugu America Budget, Donald Trump, Joe Biden, Joebiden, Republican-Telugu NRI

మిలటరీకి నిధులు పెంచడంపై రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం ఫుల్ కుషీ గా ఉన్నారట.యుద్ధాలు చేస్తూ అమెరికా సత్తా చాటుతూ అమెరికాకే తలమానికమైన మిలటరీకి బిడెన్ పెద్ద ఎత్తున కేటాయించడం మంచి నిర్ణయమని, ట్రంప్ కుడా యుద్దాల కోసం మిలటరీకి నిధులు కేటాయించారని బిడెన్ ట్రంప్ బాటలో నడవడం సంతోషంగా ఉందని అంటున్నారు.అంతేకాదు మరింత నిధులు మిలటరీకి ఇవ్వాలి పట్టుబట్టారు.

భారత్ లో ఆర్ధిక సంవత్సరం ఏప్రియల్ 1 న మొదలై మార్చి 31 తో ముగుస్తుంది కానీ అమెరికా ఆర్ధిక సంవత్సరం మాత్రం అక్టోబర్ 1 న మొదలై సెప్టెంబర్ 30 న ముగుస్తుంది.ఇక

బడ్జెట్ కేటాయింపు లో బిడెన్ ట్రంప్ కలల సౌధం సరిహద్దు గోడకు మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.

గతంలో పర్యావరణానికి ట్రంప్ నిధులలో కోత పెట్టగా బిడెన్ మాత్రం 20 శాతం నిధులు కేటాయించారు.అయితే బిడెన్ బడ్జెట్ పై బెర్నీ శాండర్స్ విమర్శలు గుప్పించారు.

దేశంలో ఎంతో మంది వృద్దులు ఆకలితో అలమటిస్తున్నారు , ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు ఏమి చేయాలో తెలియక ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఇలాంటి సమయంలో మీరు మిలటరీకి అంత పెద్ద మొత్తంలో ననిధులు కేటాయించడం సరైన నిర్ణయం కాదని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube