రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ చలన చిత్ర అవార్డులు.. ఫోటోలు వైరల్!

తాజాగా ఢిల్లీలో 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.భారతదేశ వ్యాప్తంగా సినిమా పరిశ్రమలో సత్తా చాటిన నటీ నటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేశారు.

 President Droupadi Murmu Distributed 68th Nationa Film Awards Delhi National Fi-TeluguStop.com

దేశ రాజధాని అయిన డిల్లీలోని విఘ్నయన్​ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్రప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ హాజరయ్యారు.కాగా 2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

తమిళంలో సుధా కొంగర తెరకెక్కించిన సూరరై పోట్రు.ఈ సూరరై పోట్రు సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాగా ఎంపిక అయింది.కాగా ఈ సినిమలో ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.కాగా తాజాగా డిల్లీ లో జరిగిన కార్యక్రమానికి తన భార్యతో జ్యోతిక తో కలిసి హాజరయ‍్యారు హీరో సూర్య.

 President Droupadi Murmu Distributed 68th Nationa Film Awards Delhi National Fi-TeluguStop.com

అదేవిధంగా సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన చిత్రం కలర్‌ ఫొటో.తెలుగులో ఉత్తమ చిత్రంగా అవార్టు గెలుచుకుంది ఈ సినిమా.

అలాగే సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ రూపొందించిన తెలుగు చిత్రం నాట్యం సినిమా కూడా ఉత్తమ సినిమాగా ఎంపిక అయింది.అలాగే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తాన్హాజీ జీవిత గాథతో హిందీలో తెరకెక్కిన తాన్హాజీ: ది అన్‌ సంగ్‌ వారియర్‌ ఉత్తమ వినోదాత్మక సినిమాగా అవార్డు సొంతం గెలుచుకుంది .అందులో తానాజీ పాత్రలో నటించిన అజయ్‌ దేవగణ్, సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు.కాగా సౌర్య నటించిన సూరరై పోట్రు సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే పేరుతో విడుదల అయి తెలుగు లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube