అత్యంత గోప్యంగా వైద్యపరీక్షలు: ప్రోటోకాల్‌ను పక్కనబెట్టిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం జరిపిన వాల్టర్ రీడ్ పర్యటనలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రోటోకాల్‌ను పాటించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 President Donald Trumps Visit To Walter Reed Not Protocol-TeluguStop.com

ట్రంప్ రాకకు సంబంధించి మేరీల్యాండ్‌లోని బెథెస్డా వైద్య కేంద్రానికి అధ్యక్షుడి పర్యటన గురించి ఎలాంటి నోటీసు అందలేదని తెలుస్తోంది.సాధారణంగా వాల్టర్ రీడ్ యొక్క వైద్య సిబ్బందికి అధ్యక్షుడి రాకకు ముందే శ్వేతసౌధం ముందస్తు సమాచారం వస్తుంది.

అందువల్ల ఆ ప్రాంతంలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది.

కానీ ఈసారి అలా జరగకుండా… చివరి నిమిషంలో అధ్యక్షుడి పర్యటన ఖరారయ్యింది.

అయితే ట్రంప్ గత రెండు శారీరక పరీక్షలకు సంబంధించి వైట్ హౌస్ ముందుగానే సమాచారం అందించింది.అయితే శనివారం వాల్టర్ రీడ్‌‌కు చేరుకునే వరకు ట్రంప్ కదలికలను నివేదించవద్దని వైట్ హౌస్ విలేకర్లను ఆదేశించింది.

నాలుగు గంటల పాటు జరిగిన వైద్య పరీక్షలో ట్రంప్‌కు ఎలాంటి ఆరోగ్య పరమైన ఇబ్బంది లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషామ్ తెలిపారు.

Telugu Donald Trump, Protocol, Telugu Nri Ups, Walter Reed-

ఫిబ్రవరిలో ట్రంప్ వాల్టర్ రీడ్‌ సైనిక ఆసుపత్రిలో పూర్తి శారీరక పరీక్ష చేయించుకున్నారు.బరువు 243 పౌండ్లు ఉన్నారని.అంటే గతేడాది జరిపిన పరీక్ష కంటే నాలుగు పౌండ్లు ఎక్కువ పెరిగారు.

రక్తపోటు 118/80 ఉందని.అలాగే అధిక కొలెస్ట్రాల్ చికిత్సకు ఉపయోగించే రోసువాస్టాటిన్ మందు మోతాదును పెంచినట్లు నాటి ఫలితాలు తెలిపాయి.

గతేడాది జరిపిన పరీక్షలో ట్రంప్‌కు గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు తేలింది.దీంతో అప్పటి వైట్ హౌస్‌ అధికారిక వైద్యుడు డాక్టర్ రోనీ జాక్సన్ అధ్యక్షుడు మంచి ఆహారం తీసుకోవాలని.

వ్యాయామం చేయాలని సూచించారు.దీనికి తగ్గట్టుగా ట్రంప్ తన ఆహార, వ్యాయామ నియమావళిలో చిన్న మార్పులు చేశారని శ్వేతసౌధం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube