ప్రజలకు ఇప్పటికే ఉపశమనం.. ఇక వాణిజ్యంపై ఫోకస్: మరో భారీ ప్యాకేజీ ప్రకటించిన బైడెన్

కరోనా మహమ్మారి వల్ల ఆర్ధికంగా, సామాజికంగా ఎంతో నష్టపోయిన అమెరికన్లను ఆదుకునేందుకు గాను జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక ప్యాకేజ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.ద అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌’ పేరుతో ప్రకటించిన ఈ బిల్లుకు ఇటీవల సెనేట్, అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలపగా, బైడెన్ సంతకంతో చట్టంగా మారింది.దీంతో ఈ ప్యాకేజ్ ఫలాలను ప్రజలకు పంచడం ప్రారంభించింది ఫెడరల్ ప్రభుత్వం.

 President Biden Unveils His $2 Trillion Infrastructure Plan – Here Are The Det-TeluguStop.com

దీని ద్వారా సుమారు 400 బిలియన్ డాలర్లు అమెరికన్లకు ఆర్థిక సాయంగా అందనుంది.ఏడాదికి 75 వేల డాలర్లు సంపాదిస్తున్న ఒక్కొ అమెరికన్ పౌరుడి ఖాతాలో నేరుగా 1400 డాలర్లు (సుమారు రూ.లక్ష) జమ చేయనున్నారు.దీనిలో భాగంగా మార్చి 14 నుంచి 1400 డాలర్ల పంపిణీని ప్రారంభించినట్లు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) వెల్లడించింది.

ఈ పేమెంట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఐఆర్‌ఎస్ పేర్కొంది.అలాగే ఈ ప్యాకేజీ ద్వారా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు 350 బిలియన్ డాలర్లు.నిరుద్యోగులకు సెప్టెంబర్ వరకు ప్రతి వారం 300 డాలర్ల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తారు.దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్, టెస్టుల కోసం మరో 50 బిలియన్‌ డాలర్లు కేటాయించనున్నారు.

ప్రజలను కరోనా నుంచి స్వల్పంగానైనా ఉపశమనం దక్కేలా బైడెన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

దీంతో కరోనాతో కుప్పకూలిన దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు బైడెన్ కసరత్తు ప్రారంభించారు.

దీనిలో భాగంగా ఈసారి మౌలిక సదుపాయాల రంగానికి ఊతమిచ్చేలా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.రాబోయే ఎనిమిదేళ్లలో మౌలిక రంగ అభివృద్ధికి 2.3 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు బైడెన్ తెలిపారు.దీనిని ‘‘ తరానికి ఒకసారి పెట్టే పెట్టుబడిగా’’ అధ్యక్షుడు అభివర్ణించారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో అతిపెద్ద పెట్టుబడి కూడా ఇదేనని బైడెన్ గుర్తుచేశారు.

Telugu Joe Biden, American Rescue-Telugu NRI

ఈ భారీ ఉద్దీపన ప్యాకేజీ ద్వారా సుమారు 621 బిలియన్ డాలర్లను రవాణా రంగం , వంతెనలు, రహదారులు, రోడ్ల పునరుద్ధరణ, విమానాశ్రయాల ఆధునీకరణ, ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని ప్రకటించారు.అలాగే 400 బిలియన్ డాలర్లను వృద్ధులు, వికలాంగ అమెరికన్ల సంరక్షణకు కేటాయించారు.మరో 300 బిలియన్ డాలర్లు డ్రింకింగ్ వాటర్, బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ, ఎలక్ట్రిక్ గ్రిడ్‌లను అప్‌గ్రేడ్ చేయడం వంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తామని బైడెన్ చెప్పారు.

ఇదే సమయంలో కార్పొరేట్ పన్నును 21 శాతం నుంచి 28 శాతానికి పెంచుతామని ప్రతిపాదన చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube