మరో భారతీయుడికి కీలక పదవి.. వరల్డ్ ఎర్త్ డే నాడు బైడెన్ ప్రకటన

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారతీయులకు అత్యున్నత పదవులు కట్టబెడుతూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో ఇండో అమెరికన్‌ను కీలక పదవి కోసం నామినేట్ చేశారు.వరల్డ్ ఎర్త్ డే ను పురస్కరించుకుని గురువారం రవాణా శాఖ పరిధిలోని ఫెడరల్ రైల్ రోడ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వాహకుడిగా భారత సంతతికి చెందిన అమిత్ బోస్‌ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

 President Biden Names An Indian-american For Key Infrastructure Position, Univer-TeluguStop.com

క్లైమేట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి బైడెన్ నామినేట్ చేసిన 12 మందిలో బోస్ ఒకరు.సుమారు రెండు దశాబ్ధాల పాటు ఆయన ప్రజా జీవితంలో వున్నారని.

అమెరికా వ్యాప్తంగా మెరుగైన, సురక్షితమైన, స్థిరమైన రవాణా వ్యవస్థను నిర్మించడానికి బోస్ శ్రమించారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇద్దరు కార్యదర్శుల క్రింద యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్, ఫెడరల్ రైల్ రోడ్ అడ్మినిస్ట్రేషన్‌లు పనిచేస్తున్నాయి.

అమిత్ బోస్ ప్రస్తుతం ఫెడరల్ రైల్ రోడ్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నారు.తన సుదీర్ఘ అనుభవంలో అమిత్ పాజిటివ్ ట్రైన్ కంట్రోల్ విధానంతో పాటు పది బిలియన్ డాలర్ల ఇంటర్‌సిటీ ప్యాసింజర్ రైలు కార్యక్రమం అమలును పర్యవేక్షించారు.

బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా వున్న సమయంలో అమిత్ బోస్ రవాణా కార్యదర్శి కార్యాలయంలో అసోసియేట్ జనరల్ కౌన్సెల్, ప్రభుత్వ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు.

రవాణా శాఖలో చేరడానికి ముందు బోస్.

న్యూజెర్సీ ట్రాన్సిట్, న్యూజెర్సీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌, యూఎస్ కాంగ్రెస్‌లో రవాణా శాఖ ఉద్యోగిగా పనిచేశారు.దేశంలో గుర్తింపు పొందిన రైలు ప్రాజెక్ట్‌లైన నార్త్‌ఈస్ట్ కారిడార్ గేట్‌వే ప్రోగ్రామ్, కాలిఫోర్నియా హై స్పీడ్ రైలు, ఎసిలా 2021 ట్రైన్‌సెట్స్, లిబర్టీ కారిడార్ వంటి వాటిలో అమిత్ బోస్ కీలక పాత్ర పోషించారు.

నార్త్‌ఈస్ట్ కారిడార్ గేట్‌వే ప్రోగ్రామ్ కోసం బోర్డ్ ఛైర్మన్‌గా.న్యూజెర్సీ రిస్టార్ట్, రికవరి కౌన్సిల్‌లోనూ ఆయన పనిచేశారు.

బోస్ ఐదేళ్ల చిరుప్రాయంలో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వలస వచ్చారు.జార్జియాలోని డెకాల్బ్ కౌంటీలో ఆయన బాల్యం గడిచింది.

కొలంబియా కాలేజీ నుంచి డిగ్రీ, కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ నుంచి మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ చేశారు.జార్జియా విశ్వవిద్యాలయం నుంచి జేడీ పట్టా పొందారు.

ప్రస్తుతం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి అర్లింగ్టన్‌లో నివసిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube