కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత : మంత్రి కమలాకర్

కరీంనగర్ పట్టణంలో ఏకంగా 240 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.రూ.2,37,55,492 కోట్ల విలువైన చెక్కులను మంత్రి గంగుల కమలాకర్ ఈ రోజు (శుక్రవారం) పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు చెక్కులు అందజేశారు.లబ్దిదారులకు చెక్కుల అందజేసి ఆయన మాట్లాడారు.

 Karimnagar, Ministar Kamalakar, Kalyana Laxmi-TeluguStop.com

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పేదింటికి వరం లాంటిందన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానీ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మనకు అందిస్తున్నారని మంత్రి కమలాకర్ అన్నారు.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలా భావించి ఓ అన్నలా, మేనమామలా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలబడుతున్నారని పేర్కొన్నారు.పేద కుటుంబాల్లో కూతురు పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు అప్పుల పాలయ్యేవారు.

కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ ఇబ్బంది లేకుండా పోయిందని తెలిపారు.

తెలంగాణ ఏర్పడక ముందు కూడా ఎన్నో ప్రభుత్వాలు పాలించినా ఇలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదని ఆరోపించారు.

ఇలాంటి పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రమే అన్ని రాష్ట్రాలకు నిదర్శనమని అన్నారు.కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్ ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరో నాలుగైదు రోజుల్లో క్లియర్ చేసి చెక్కులు పంపిణీ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube