సికింద్రాబాద్ గాంధీ ఐడియాలజీ సెంటర్లో భారత్ జోడో సన్నాహక సమావేశం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్.అక్టోబర్ 24 నుంచి తెలంగాణలో జరిగే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడోయాత్ర విజయవంతం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణ బద్ధులై పని చేయాలి.

 Preparatory Meeting Of Rahul Gandhi Bharat Jodo Yatra At Gandhi Ideology Centre-TeluguStop.com

తెలంగాణలో ప్రతి గడప నుంచి ఈ యాత్రలో పాల్గొనే విధంగా పార్టీ శ్రేణులు చొరవ చూపాలి.బిజెపి పాలనలో దేశంలో పెరుగుతున్న రాజకీయ ఆర్థిక అసమానతలు తొలగించడం కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టారు.

భారత్ జోడోయాత్ర దేశంలో చారిత్రాత్మకంగా సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది.మత, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ ఆర్థిక సంపదను కొద్ది మందికే దోచిపెడుతున్న దేశంలోని కార్పొరేట్ పరిపాలనకు స్వస్తి పలకడానికే రాహుల్ భారత్ జూడో యాత్ర చేపట్టారు.

రాహుల్ గాంధీ గారు చేపట్టిన ఈ యాత్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కాదు.దేశ జాతి ఐక్య నిర్మాణానికి చేస్తున్న యాత్ర.భారత్ ఔన్నత్యాన్ని కాపాడటం కోసమే రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారు.రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో పాదయాత్ర తమిళనాడు కేరళలో దిగ్విజయంగా విజయవంతం అయింది.

కర్ణాటకలో విశేష ఆదరణ పొందుతున్నది.తమిళనాడు కర్ణాటక కేరళలో కంటే పెద్ద ఎత్తున ఎఫెక్ట్తో తెలంగాణలో రాహుల్ యాత్రను విజయవంతం చేద్దాము.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube