మొబైల్ రీఛార్జ్ కి కూడా ఐడి ఫ్రూఫ్ అడుగుతారంటా

ప్రస్తుతం ప్రీపేయిడ్ కనెక్షన్ వాడుతున్న వినియోగదారులందరి ఐడి ఫ్రూఫ్ కావాలని సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది.సోమవారం జస్టిస్ జే.

 Prepaid Users Will Now Be Asked Id Proof Before Recharge?-TeluguStop.com

ఎస్.కేహర్, ఎన్.వీ.రమణ బెంచి ముందు భారత ప్రభుత్వ అధికారులు మొబైల్ కనెక్షన్ కి ఆధార్ కార్డుకి ఎలాంటి సంబంధం జత చేయనున్నారో, ఆధార్ కార్డు ఆధారిత యూజర్ వెరిఫికేషన్ ని కొత్త కనెక్షన్లకు ఎలా ఖచ్చితం చేయనున్నారో వివరిస్తుండగా, బెంచి కొత్త ప్లాన్ ని ప్రభుత్వానికి సలహాగా ఇచ్చింది.

కేవలం కొత్త యూజర్లనే కాదు, ప్రస్తుతం ఉన్న ప్రీపేయిడ్ యూజర్స్ అందరిని ఈ ఆధార్ యూజర్ వెరిఫికేషన్ కిందికి తీసుకురావలని కోర్టు సూచించింది.దీనికోసం, మొబైల్ రిఛార్జ్ చేసుకునేటప్పుడు వినియోగదారుల నుంచి ఐడి ఫ్రూఫ్ అడగాలని, ఈరకంగా భారతదేశంలో ఉన్న ప్రతీ యొక్క మొబైల్ కనెక్షన్ వినియోగదారుడిని చెక్ చేయాలని కోర్టు సూచించింది.

ఈ పని పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి ఏడాదికాలం సమయాన్ని గడువుగా ఇచ్చింది.

ప్రభుత్వం త్వరలోనే ఓ కొత్త మెకానిజంతో మనందరిని ఐడి ప్రూఫ్ వివరాలను క్రాస్ చెక్ చేసే పనులు మొదలుపెట్టవచ్చు.

అంటే, బ్యాలెన్స్‌ వేయించుకోవాలంటే ఆధార్ కార్డు దగ్గర ఉండాల్సిందే అన్నమాట.ఇక జిమ్మిక్కులు, ఫేక్ ఐడిఫ్రూఫ్ తో కనెక్షన్లు నడిపేవారి ఆటలు సాగవు అన్నమాట.

మరి ప్రభుత్వం ఎలాంటి సిస్టమ్ తో రీఛార్జ్ చేసేటప్పుడు ఐడి వివరాలు అడుగుతుందో, ఎలాంటి టెక్నాలజీ వాడుతుందో, దీని వలన ప్రజలకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందో, ఈ ప్లాన్ కి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube