ఒక పక్క పెట్రోల్ ధరలు, మరో పక్క గ్యాస్, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.ఈ నేపథ్యంలోనే మొబైల్ రీఛార్జ్ రేట్లను కూడా పెంచేశాయి భారత టెలికాం సంస్థలు.
దాంతో సగటు కస్టమర్ పై మరింత భారం పడుతోంది.తాజాగా వొడాఫోన్ ఐడియా(వీఐ), ఎయిర్‌టెల్ తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను 20 నుంచి 25 శాతం వరకు పెంచుతూ కస్టమర్లకు షాక్ ఇచ్చాయి.
నవంబర్ 25 నుంచి వీఐ కొత్త ధరలు, నవంబర్ 26 నుంచి ఎయిర్‌టెల్ ప్లాన్‌ల కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.ఇప్పుడు 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే వీఐ, ఎయిర్‌టెల్ కనీస రీఛార్జ్ ప్లాన్ ధర రూ.99గా ఉంది.ధరలు పెరిగిన తర్వాత ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్‌లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఎయిర్‌టెల్ కొత్త ధరలు అమల్లోకి వచ్చాక కస్టమర్లు.ప్రతీ నెలవారీ ప్లాన్ కోసం కనీసం రూ.50 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.అపరిమిత కాలింగ్, 6జీబీతో 84 రోజుల వ్యాలిడిటీ గల ప్లాన్ ధర గతంలో రూ.379 ఉండేది.అది ఇప్పుడు రూ.455కి పెరిగింది.అలాగే 3జీబీ డేటా అందించే టాప్-అప్ ప్లాన్ రూ.48 ధర రూ.58కి పెరిగింది.రూ.98 ప్లాన్ ధర రూ.118కి పెరగింది.251 రూపాయిల రీఛార్జ్ ధర రూ.301కి పెరిగింది.రూ.75గా ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.99 కి పెరిగింది.రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.179 రూపాయలుగా ఉంది.రూ.219 ప్లాన్ ధర 265 రూపాయిలు, 249 ప్లాన్ ధర 299 రూపాయిలు అయింది.

అలాగే ఇంతముందు ఉన్న 298 ప్లాన్ ధర రూ.359కి పెరిగింది.గతంలో 56 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 1.5జీబీ డేటా అందించే ప్లాన్ ధర,అలాగే 2జీబీ డేటా అందించే ప్లాన్ ధరలపై ఏకంగా రూ.80, రూ.100 పెరిగాయి.365 రోజుల వ్యాలిడిటీతో గల రూ.1,498 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.1,799కి పెరిగింది.రూ.2,498 ప్లాన్ ధర ఇప్పుడు రూ.2,999కి ఎగబాకింది.
కాగా కొత్త వీఐ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరల విషయానికి వస్తే 28 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ చేసే 75 ప్లాన్ ధర ఇప్పుడు రూ.99కి పెరిగింది.అలాగే అన్లిమిటెడ్ టాకింగ్, డేటా ప్రీపెయిడ్ కేటగిరీలో, రూ.149 ప్లాన్ ధర రూ.179 గా అయింది.రూ.219 ప్లాన్ ధర రూ.269, రూ.249 ప్లాన్ ధర రూ.299 గా పెరిగింది.ఈ క్రమంలోనే 299 రూపాయిల ప్లాన్ ధర రూ.359కి మారింది.అలాగే రూ.379గా ఉన్న ప్లాన్ ధర రూ.459కి పెరిగింది.

రూ.399 ప్లాన్ ఇప్పుడు రూ.479.రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.539కి పెరిగింది.అలాగే రూ.699 ధర ఉన్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ఇప్పుడు రూ.839 అయ్యింది.365 రోజుల వ్యాలిడిటీలో ఉన్న ప్లాన్ ధర ప్రస్తుతం రూ.1,499 ఉండగా అది కాస్త 1,799 రూపాయలుగా ఉంది.అలాగే రూ.2,399 ప్లాన్ ధర ఇప్పుడు 2,899కి పెరిగింది.ఈ రీఛార్జ్ లు అన్ని అపరిమిత కాలింగ్ తో పాటు, ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్ లు, డేటా ప్లాన్స్ తో లభిస్తాయి.
కానీ ఒక్కో ప్లాన్ కి ఒక్కోలాగా వాలిడిటీ ఉంటుంది.