ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు..ఆమెకు బెడ్ రూమ్ లో అతను చుక్కలు చూపించాడు.!       2018-07-06   01:43:17  IST  Raghu V

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే గొప్ప వరం అనే చెప్పాలి. ఎందుకంటే మన దగ్గర చాలా వరకు పెళ్లిళ్లు పెద్దలు కుదిర్చినవే అవుతున్నాయి. ప్రేమ పెళ్లి అనగానే చాలా మంది తల్లితండ్రులు ఎత్తున ఎగిసిపడుతూ ఉంటారు. ముఖ్యంగా వారికి అడ్డొచ్చేది కులం ఆ తర్వాత బంధువులు. ఇన్ని సమస్యల మధ్య ప్రేమను గెలిపించడం కష్టమే. కొంతమంది అందుకే కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయి కూడా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం అనేది మాములు విషయం కాదు.

ప్రేమ పెళ్లిలో ఇద్దరి మధ్య గొడవలు రావు అని అనుకుంటాము. ఎందుకంటే వారిద్దరి మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం అలా ఉంటుంది. ఒకర్ని ఒకరు సులభంగా అర్ధం చేసుకుంటారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. కానీ ప్రేమ పెళ్లి లు అన్ని సార్లు సంతోషాన్ని ఇవ్వదు అని నిరూపించింది ఓ ప్రేమ జంట.

కోల్కత్త కు చెందిన దీప.. ప్రశాంత్ ను కాలేజీ రోజుల్లోనే ప్రేమించింది. ఇద్దరూ మూడేళ్ల వరకూ చెట్టపట్టాలేసుకుని తిరిగారు. గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుకున్నారు. దీప తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది. వారు కూడా అభ్యుదయ భావాలున్నవారు కావడంతో పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు.

కానీ పెళ్లయిన కొన్ని రోజులకే ప్రశాంత్ నిజస్వరూపం బయటపడింది. తరచూ అతడు దీపపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేవాడు.. కోపం వస్తే చేయి కూడా చేసుకునే వాడు. అంతే కాదు. పడక గదిలోనూ విచిత్రంగా ప్రవర్తించేవాడు.. తన రొటీన్ శృంగారం ఆనందం ఇవ్వడంలేదని కొత్తగా ట్రై చేద్దామని విసిగించడం ప్రారంభించాడు. చివరకు దీప వారిస్తున్నా వినకుండా యానల్ సెక్స్ కు ప్రయత్నించాడు.

దీంతో సహనం కోల్పోయిన దీప.. అతన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. ప్రశాంత్ తో నరకం కంటే.. పుట్టింటికి వెళ్లడమే కరక్ట్ అనుకుంది. ఫోన్ చేసి తండ్రికి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పింది. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం కంటే తన ఆనందమే తనకు ముఖ్యం అనుకుంది దీప. విషయం క్రమంగా తెలుసుకున్న పెద్దలు ప్రశాంత్ కు కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ వారిద్దరినీ కలిపే ప్రయత్నంలో ఉన్నారు.